India: ఈరోజు నీతి ఆయోగ్ పాలకమండలి 6వ సమావేశం

India: ప్రధాని మోడీ అధ్యక్షతన వర్చువల్ మీటింగ్ * హాజరుకానున్న సీఎంలు, లెఫ్టినెంట్ గవర్నర్లు

Update: 2021-02-20 04:27 GMT

నీతి ఆయోగ్ మీటింగ్ (ఫైల్ ఇమేజ్ ది హన్స్ ఇండియా)

India: ఇవాళ ప్రధాని మోడీ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నీతి ఆయోగ్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల సీఎంలు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, మేకిన్ ఇండియా, మానవ వనరుల అభివృద్ధి, క్షేత్రస్థాయి వరకు సేవల పంపిణీ, ఆరోగ్యం, పోషణపై చర్చ జరగనుంది. ఈ సమావేశంలో పాలకమండలి ఎక్స్ అఫిషియో సభ్యులు, కేంద్ర మంత్రులు, వైస్ చైర్మన్, సభ్యులు పాల్గొననున్నాయి. కరోనా కారణంగా గతేడాది నీతి ఆయోగ్ సమావేశం జరగలేదు.

Tags:    

Similar News