Bengal Elections 2021: కేంద్ర ఎన్నికల కమిషన్‌కు టీఎంసీ ఫిర్యాదు
Bengal Elections 2021: మమతపై దాడి కుట్రపూరితంగా జరిగిందేనని, ఘటనపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని టీఎంసీ డిమాండ్ చేసింది.
మమతా బెనర్జీ (ఫైల్ ఫొటో)
Bengal Elections 2021: మమతా బెనర్జీపై దాడి కుట్రపూరింతా జరిగిందని ఆరోపిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ దాడి ఘటనపై సీఈసీకి ఫిర్యాదు చేసింది. ఈమేరకు ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల అధికారి సునీల్ ఆరోరాను టీఎంసీ బృందం కలిసింది. ఈ సందర్భంగా సీఈసీ కి ఫిర్యాదు అనంతరం మాట్లాడుతూ, దాడి ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేసినట్లు తెలిపింది.
మరోవైపు దీదీ ఆస్పత్రిలో చేరడంతో ఎన్నికల మేనిఫెస్టో వాయిదా పడిన సంగతి తెలిసిందే. మరికొద్ది రోజులపాటు ఎన్నికల మేనిషెస్టో ను వాయిదా వేస్తున్నట్లు టీఎంసీ ప్రకటించింది. మార్చి 14న టీఎంసీ మేనిఫెస్టో ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.