TikTok's Indian Alternative Chingari App: టిక్‌టాక్ ఔట్.. 'చింగారి' ఇన్.. ల‌క్ష‌ల‌మంది డౌన్‌లోడ్

TikTok’s Indian Alternative Chingari App: దేశ భద్రత దృష్ట్యా టిక్‌టాక్‌ సహా 59 యాప్‌లపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. వీటిలో టిక్‌టాక్, జూమ్, హెలో యాప్ లపై నిషేదం విధించింది.

Update: 2020-06-30 11:52 GMT

TikTok's Indian Alternative Chingari App: సరిహద్దులోని జూన్ 15 గల్వాన్‌ వద్ద భీకర ఘర్షణ తర్వాత దేశంలో చైనా తీరు పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో కేంద్రం చైనా దేశానికి చెందిన పలు యాప్‌లపై నిషేదం విధించింది. దేశ భద్రత దృష్ట్యా టిక్‌టాక్‌ సహా 59 యాప్‌లపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. వీటిలో టిక్‌టాక్, షేర్ ఇట్, యూసీ బ్రౌజర్, జూమ్, హెలో యాప్ లపై నిషేదం విధించింది. ఆ యప్స్ అన్‌ ఇన్‌స్టాల్ చేసి వాటికి ప్రత్యామ్నాయం యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు.

అయితే ఇప్ప‌టికే ఈ యాప్‌ను భార‌త్‌లో దాదాపు 20 కోట్ల మంది వినియోగిస్తున్నారు. భార‌త్ నిషేదం విధించిన యాప్స్ లో టిక్ టాక్ కూడా ఉంది. దీంతో కొంద‌రు టిక్‌టాక్ యూజ‌ర్లు అయోమ‌యానికి గురైయ్యార‌వుతున్నారు. ముఖ్యంగా టిక్ టాక్ ద్వారా ఫేమ‌స్ అయిన వారంద‌రకి ఇప్ప‌డు ఏం చేయాలో అర్థం కావ‌డం లేదు. టిక్‌టాక్ ప్ర‌త్యామ్నాయం ఏంటా అని శోధించారు. భార‌తీయులు త‌యారు చేసిన 'చింగారి' యాప్ క‌ళ్లెదుట ప్ర‌త్య‌క్ష‌మయ్యింది. చింగారి యాప్ ను గంటలోనే ఈ యాప్‌ను ల‌క్ష‌మంది దాకా డౌన్‌లోడ్ చేసుకున్నారు.

కాగా.. టిక్‌టాక్ మాదిరే ఉన్న ఈ చింగారి యాప్‌పై ప్ర‌స్తుతం ఇండియ‌న్స్ మ‌క్కువ చూపిస్తున్నారు. ఈ యాప్ ద‌క్షిణాది భాష‌లు తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం , ఉత్తారాది భాష‌లు హిందీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, అలాగే ఇంగ్లీష్ కూడా ఈ యాప్ అందుబాటులో ఉంది. భార‌తీయా యాప్ కావ‌డంతో దీనిని డౌన్ లోడ్ చేసుకోవాల‌ని కొంద‌రు నెటిజ‌న్లు ట్వీట్స్ చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో ప్ర‌ముఖ‌ పారిశ్రామికవేత్త ఆనంద్ మ‌హింద్రా సైతం చింగారి యాప్‌ను డౌన్‌లోడ్ చేసి దాని ఫీచ‌ర్స్‌ను వివ‌రించారు. టిక్‌టాక్ ఔట్.. చింగారి ఇన్.. ల‌క్ష‌ల‌మంది డౌన్‌లోడ్

చింగారి యాప్ బాగుంద‌ని ఆనంద్ మహింద్ర అన్నారు. ఇంత ముందు తాను టిక్ టాక్ యాప్ డౌన్ లోడ్ చేసుకోలేద‌ని.. ఇప్పుడు చింగారి డౌన్ లోడ్ చేసుకుంటున్న‌ట్లు తెలిపారు. చింగారి యాప్‌ను బెంగుళూరుకు చెందిన బిస్వాత్మ నాయక్‌, సిద్ధార్థ్ గౌతమ్ గ‌తేడాది రూపొందించారు. అయితే భార‌తీయులు విదేశీ వ‌స్తువులు, యాప్‌లపై మోజెక్కువ కాబ‌ట్టి చింగారి యాప్ ఆద‌ర‌ణ‌కు నోచుకోలేదు.



Tags:    

Similar News