కరోనా ప్రస్తుతం ప్రపంచాన్నే వణికిస్తున్న పేరు. కరోనా వైరస్ మొదట చైనా దేశంలో మొదలైంది అందుకే కాబోలు దీనిని చైనా వైరస్ అని కూడా అంటూవుంటారు. ఈ కరోనా వైరస్ మెల్లమెల్లగా ఇతర దేశాలకు వ్యాపిస్తుంది, ఇది సుమారు 145 దేశాలలో వ్యాపించింది. అయితే ఈ వైరస్ రాకుండా ఉండటానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే ఈ వైరస్ ని ఎదుర్కోవటానికి మానవాళి అంతా ఒక్కటై ఒకరికొకరు సాయం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అలాగే ప్రతీఒక్కరిలో ధ్యారం నింపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం పరిస్థితి వేరేగా ఉంది. మార్కెట్లో ఉన్న డిమాండ్ ని చూసి ముంబయి, గుర్గావ్‌లలో నకిలీ మాస్కులు, శానిటైజర్లను తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. వీటినే అలుసుగా తీసుకుని కరోనా పరీక్షలు చేయటానికి వచ్చామని చేపి దోపిడీలకు పాల్పడుతున్నారు.
వృద్దులు లక్ష్యంగా... దోపిడీలు..
వృద్ధులను లక్ష్యంగా చేసుకుని దొంగలు ఇలాంటి దోపిడీలకు పాల్పడుతున్నారు. ప్రజలను అప్రమత్తం చేస్తూబార్సిలోనా పోలీసులు ఓ ప్రకటన చేశారు. ఇటీవల ఇద్దరు వ్యక్తులు డాక్టర్లలా తెల్ల దుస్తులు, ముఖానికి మాస్కులు ధరించి వృద్ధుల ఇళ్లకు వెళ్తున్నారు. కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉందని, అందుకే ప్రతి ఇంటింటికి వచ్చి వైద్య పరీక్షలు చేస్తున్నామని పేర్కొన్నారు. అలా ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు బాధితులను బెదిరించి వారి వద్ద ఉన్ననగలు, ఇంట్లో ఆభరణాలు ఇలా అందిన కాడికి దోచుకుంటూ దోపిడీలకు పాల్పడుతున్నట్లు సమాచారం అందింది.
అప్రమత్తం చేస్తూ పోలీసులు ట్వీట్
ఈ సంద్భంగా పోలీసులు ట్విట్టర్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ''కొంతమంది నకిలీ వైద్యులు ఓ మహిళ ఇంట్లోకి ప్రవేశించి దోపిడీకి ప్రయత్నించినట్లు ఫిర్యాదు అందింది. డాక్టర్లలా తెల్ల వస్త్రాలు ధరించిన వారిద్దరూ ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారని, ఆమె పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించడంతో వెళ్లిపోయారు. ఈ విషయాన్ని దయచేసి మీ ఇంట్లోని పెద్దవాళ్లకు చెప్పండి. ఎవరైనా అపరిచితులు వైద్యులమని చెప్పి కరోనా టెస్టులు చేయాలని ఇళ్లకు వస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని '' అని పేర్కొన్నారు. చూశారుగా.. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. అసలే కరోనా భయం గుప్పట్లో ఉన్న ప్రజలకు కరోనా దొంగలు మరింత భయపెడుతున్నారు.
🔴 Nou cas d'intent d'estafa de falsos metges a @pinedademar. Dos homes amb bata blanca volien entrar al pis d'una senyora per fer proves de #coronavirus.
— Mossos (@mossos) March 12, 2020
En advertir-los que n'informaria a la policia van marxar sense entrar-hi.
✅Informa la gent gran d'aquests consells 👇 pic.twitter.com/6QG3V9OuPp