New ATM Rules : ఏటీఎం యూజర్స్‌కు షాక్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్.. ఇక చుక్కలే!

New ATM Rules : ఏప్రిల్ 1 నుంచి ఏటీఎం యూజర్స్‌కు కొత్త కష్టాలు మొదలుకానున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ, పీఎన్‌బీ, బంధన్ బ్యాంక్ వంటి ప్రముఖ బ్యాంకులు ఏటీఎం విత్‌డ్రాయల్ లిమిట్స్, ట్రాన్సాక్షన్ ఛార్జీలను సవరించాయి. ఫ్రీ లిమిట్ దాటితే ఎంత వసూలు చేస్తారు? మీ అకౌంట్‌లో బ్యాలెన్స్ లేక ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే పడే జరిమానా ఎంత? అనే పూర్తి వివరాలను ఈ స్టోరీలో చదవండి.

Update: 2026-03-27 12:32 GMT

New ATM Rules : ఏటీఎం యూజర్స్‌కు షాక్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్.. ఇక చుక్కలే!

New ATM Rules :మీరు ఎక్కువగా ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేస్తుంటారా.. అయితే ఈ వార్త మీకోసమే. ఏప్రిల్ 1, 2026 నుంచి పలు ప్రముఖ బ్యాంకులు ఏటీఎం లావాదేవీల నియమాల్లో కీలక మార్పులు చేస్తున్నాయి. డెబిట్ కార్డ్ వినియోగం, యూపీఐ (UPI) ద్వారా నగదు ఉపసంహరణ పరిమితులు, ఛార్జీలలో ఈ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఆ వివరాలేంటో ఈ స్టోరిలో తెలుసుకుందాం.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్..

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన కస్టమర్ల కోసం ఒక ముఖ్యమైన మార్పును తీసుకొచ్చింది. ఇకపై ఏటీఎం నుంచి యూపీఐ ద్వారా తీసే నగదును కూడా నెలవారీ 'ఫ్రీ ట్రాన్సాక్షన్ లిమిట్'లోనే గణిస్తారు. గతంలో వీటిని విడిగా పరిగణించేవారు. మెట్రో నగరాల్లో ఇతర బ్యాంక్ ఏటీఎంల నుంచి 3 లావాదేవీలు, ఇతర నగరాల్లో 5 లావాదేవీలు మాత్రమే ఫ్రీగా లభిస్తాయి. ఉచిత కోటా ముగిసిన తర్వాత ప్రతి ట్రాన్సాక్షన్‌కు రూ.23 (ప్లస్ టాక్స్) వసూలు చేయనున్నారు. ఇకపై సాయంత్రం 7:30 గంటల తర్వాత చేసే ఏటీఎం లావాదేవీలను మరుసటి రోజు ఖాతాలోకి చేరుస్తారు. అంటే నెల చివరి రోజు రాత్రి చేసే విత్‌డ్రాయల్స్ తర్వాతి నెల కోటాలోకి వెళ్తాయి.

పీఎన్‌బీ & బంధన్ బ్యాంక్

పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన కొన్ని రకాల డెబిట్ కార్డుల డైలీ విత్‌డ్రాయల్ లిమిట్‌ను సవరించింది. ఏప్రిల్ 1 నుంచి ఎంపిక చేసిన కార్డులకు గరిష్ట విత్‌డ్రాయల్ లిమిట్‌ను రూ.1 లక్ష నుంచి రూ.50,000కు తగ్గించారు. కార్డ్ కేటగిరీని బట్టి ఈ పరిమితి రూ.50,000 నుంచి రూ.75,000 మధ్య ఉండవచ్చని సమాచారం. ఇదే సమయంలో బంధన్ బ్యాంక్ కూడా తన ఏటీఎం పాలసీని అప్‌డేట్ చేసింది. ఇకపై బ్యాంకు సొంత ఏటీఎంలలో నెలకు 5 ఉచిత లావాదేవీలు. ఇతర బ్యాంక్ ఏటీఎంలలో మెట్రోల్లో 3, మిగిలిన చోట్ల 5 ఉచిత ట్రాన్సాక్షన్స్ ఉంటాయని తెలిపింది. బ్యాలెన్స్ ఎంక్వైరీ వంటి నాన్-ఫైనాన్షియల్ లావాదేవీలను కూడా ఇకపై ఉచిత కోటాలో భాగంగానే లెక్కిస్తారని చెప్పింది.

బ్యాంకింగ్ వ్యవస్థలో ఏటీఎం ఫీ సవరించడంతో ఛార్జీలు ఇలా ఉండనున్నాయి.. ఇకపై ప్రతి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌కు రూ.23 ఛార్జ్ చేయనున్నారు. నాన్-ఫైనాన్షియల్ (బ్యాలెన్స్ చెక్ వంటివి) రూ.10 వసూలు చేయబోతున్నారు. అకౌంట్‌లో తగినంత డబ్బు లేక ట్రాన్సాక్షన్ విఫలమైతే రూ.25 జరిమానా విధిస్తారు. నిజానికి ఈ మార్పులు చిన్నవిగా అనిపించినా, తరచుగా ఏటీఎంలను వాడేవారిపై ఆర్థిక భారం పడనుందని చెబుతున్నారు. ఛార్జీల నుంచి తప్పించుకోవడానికి బ్యాంకులు కస్టమర్లను యూపీఐ, నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ చెల్లింపుల వైపు ప్రోత్సహిస్తున్నాయి. పెరుగుతున్న ఏటీఎం నిర్వహణ ఖర్చుల దృష్ట్యా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News