Ration Card: రేషన్‌కార్డ్‌లో పిల్లల పేరుని చేర్చాలా.. కచ్చితంగా ఈ పత్రాలు అవసరం..

Ration Card: రేషన్‌కార్డ్‌లో పిల్లల పేరుని చేర్చాలా.. కచ్చితంగా ఈ పత్రాలు అవసరం..

Update: 2022-02-03 08:30 GMT

Ration Card: రేషన్‌కార్డ్‌లో పిల్లల పేరుని చేర్చాలా.. కచ్చితంగా ఈ పత్రాలు అవసరం..

Ration Card: రేషన్ కార్డుపై ఆధారపడి ఎన్నో పేద కుటుంబాలు బతుకుతున్నాయి. ప్రభుత్వం రేషన్‌ కార్డు కలిగిన వారికి నెలా నెలా నిత్యావసర సరుకులను అందిస్తుంది. అంతేకాదు ఈ కార్డు వివిధ ప్రభుత్వ పథకాలకు కూడా ఉపయోగపడుతుంది. గుర్తింపు కార్డుగా పనిచేస్తుంది. అందుకే ఇందులో కుటుంబ సభ్యులందరి పేర్లు ఉండటం చాలా ముఖ్యం. లేదంటే తక్కువ రేషన్ లభిస్తుంది. ఐదేళ్లు దాటిన మీ పిల్లల పేర్లను రేషన్‌కార్డులో నమోదు చేయాలంటే కొన్ని ముఖ్యమైన పత్రాలు అవసరమవుతాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

పిల్లల పేరును రేషన్‌కార్డులో యాడ్ చేయాలంటే ఇంటి పెద్ద పాస్‌పోర్ట్‌ సైజ్ ఫోటో అవసరం. అయితే అప్పటికే రేషన్ కార్డులో అతడి ఫొటో ఉంటుంది. తర్వాత పిల్లల జనన ధృవీకరణ పత్రం కావాల్సి ఉంటుంది. మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతీ నుంచి జారీ చేసిన జనన ధృవీకరణ పత్రం అవసరమవుతుంది. మీరు ఒక బిడ్డను దత్తత తీసుకున్నట్లయితే ఆ సందర్భంలో పిల్లల దత్తత ధృవీకరణ పత్రం అవసరం. మీరు పిల్లల పేరును నమోదు చేసేటప్పుడు ఈ పత్రాన్ని మీ వద్ద కచ్చితంగా ఉంచుకోవాలి.

ఆధార్ కార్డ్ అనేది చాలా ముఖ్యమైన పత్రం. ఇది గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుంది. ఈ రోజుల్లో పిల్లలకి కూడా ఆధార్ కార్డ్ ఇస్తున్నారు. అంటే మీ పిల్లల ఆధార్ కార్డు మీ వద్ద ఉండాలి. పిల్లల పేరును నమోదు చేయడానికి ఆధార్ ఫోటోకాపీ అవసరమవుతుంది. మీరు మొదటగా దరఖాస్తు ఫారమ్ను నింపి దాంతో పాటు అన్ని పత్రాలను సబ్‌మిట్‌ చేయాలి. సంబంధిత అధికారి తనిఖీ చేసిన తర్వాత రేషన్ కార్డులో మీ పిల్లల పేరు యాడ్ చేస్తారు. రేషన్‌కార్డులో ఏదైనా తనిఖీ చేయడానికి, మార్చడానికి, కలపడానికి మీరు జాతీయ ఆహార భద్రతా పోర్టల్‌కి వెళ్లాలి. కొన్ని దశలను అనుసరించడం ద్వారా మీరు ఏ పనినైనా సులభంగా చేసుకోవచ్చు. 

Tags:    

Similar News