MahaKumbh Mela 2025: మార్చి వరకు మహాకుంభమేళా పొడిగింపు? ప్రయాగ్ రాజ్ కలెక్టర్ ఏమన్నారంటే?

Update: 2025-02-19 04:30 GMT

MahaKumbh Mela 2025: మార్చి వరకు మహాకుంభమేళా పొడిగింపు? ప్రయాగ్ రాజ్ కలెక్టర్ ఏమన్నారంటే?

MahaKumbh Mela 2025: జనవరిలో మొదలైన మహాకుంభమేళా..ఫిబ్రవరి 26తో ముగుస్తుంది. అయితే యాత్రికుల తాకిడి కారణంగా ఈ పవిత్ర కార్యక్రమాన్ని పొడిగించాలని సర్వత్రా విజ్నప్తులు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో మహాకుంభమేళాని మార్చ్ వరకు పొడిగించారని వార్తలు కూడా వస్తున్నాయి. దీనిపై యూపీ ప్రయాగ్ రాజ్ జిల్లా మెజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ మందార్ స్పందించారు. మహాకుంభమేళాను మార్చ్ వరకు పొడిగించినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. అది తప్పుడు వార్త అన్నారు.

మహాకుంభమేళాను పొడిగించినట్లు వస్తున్న వార్తలు నిరాధారమైనవి అని ప్రయాగ్ రాజ్ జిల్లా మెజిస్ట్రేట్ తెలిపారు. శుభ సమయాన్ని బట్టి మహాకుంభ్ మేళా షెడ్యూల్ ను ముందుగానే విడుదల చేసినట్లు అందుకు తగ్గట్లుగానే ఫిబ్రవరి 26న ఈ పవిత్ర కార్యక్రమం ముగుస్తుందని వివరించారు. అప్పటి వరకు యాత్రికులు అందరికీ సజావుగా రాకపోకలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని మీడియాతో మాట్లాడినట్లు ఆయన వెల్లడించారు.

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు భక్తులందరికీ అనుకూలంగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా మెజిస్ట్రేట్ కూడా తెలిపారు. ఎలాంటి ప్రచారాలనూ నమ్మకూడదని విజ్నప్తి చేశారు. మేళా తేదీని పొడిగించాలని ప్రభుత్వం లేదా పరిపాలన నుంచి ఎలాంటి ప్రతిపాదన లేదని స్పష్టం చేశారు.

మహాకుంభమేళాలో మిగిలిన రోజుల్లో ప్రజలు సజావుగా స్నానాలు చేసి సురక్షితంగా తిరిగి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. సజావుగా ట్రాఫిక్ నిర్వహణ మా ప్రాధాన్యత. దీనిపై నిరంతరం పనిచేస్తుంటాం. ప్రయాగ్ రాజ్ లో రోజువారీ జీవితంపై ప్రభావం చూపకుండా భక్తుల రాకపోకలను సమతుల్యం చేస్తూ పనిచేస్తున్నామని ప్రయాగ్ రాజ్ జిల్లా మెజిస్ట్రేట్ రవీంద్ర తెలిపారు.

Tags:    

Similar News