Gyanvapi Case: జ్ఞానవాపి కమిటీ పిటిషన్‌పై నేడు సుప్రీంలో విచారణ

Gyanvapi Case: పూజలకు అనుమతిని వ్యతిరేకిస్తూ పిటిషన్‌ దాఖలు

Update: 2024-04-01 06:07 GMT

Gyanvapi Case: జ్ఞానవాపి కమిటీ పిటిషన్‌పై నేడు సుప్రీంలో విచారణ 

Gyanvapi Case: జ్ఞానవాపి కమిటీ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు విచారించనుంది. జ్ఞానవాపి మసీదులో హిందువులు పూజలు నిలిపివేయాలంటూ పిటిషన్‌ దాఖలయ్యింది. వివాదాస్పద కట్టడం యొక్క దక్షిణ చివరలో ఉన్న వ్యాస్ జీ నేలమాళిగలో హిందువులు పూజలు చేసేందుకు అనుమతించాలన్న అలహాబాద్ హైకోర్టు నిర్ణయాన్ని కమిటీ సవాలు చేసింది.

వారణాసిలోని జ్ఞానవాపి మసీదుగా పిలవబడే అంజుమన్ మసీదు ఏర్పాటు కమిటీ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన డివిజన్ బెంచ్ ఇవాళ విచారించనుంది. ఫిబ్రవరి 26వ తేదీన అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఈ పిటిషన్‌లో పూజలపై నిషేధం విధించాలని మసీద్ కమిటీ డిమాండ్ చేశారు.

Tags:    

Similar News