ఇండియాలో వారి సంఖ్య రెట్టింపు.. ప్రపంచంలోనే మూడో స్థానం..

Billionaires: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం మొత్తం ఆర్థిక పరిస్థితి దెబ్బతింది...

Update: 2022-03-02 03:08 GMT

ఇండియాలో వారి సంఖ్య రెట్టింపు.. ప్రపంచంలోనే మూడో స్థానం..

Billionaires: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం మొత్తం ఆర్థిక పరిస్థితి దెబ్బతింది. కానీ అదే సమయంలో భారతదేశంలో ధనవంతుల సంఖ్య పెరిగింది. గత కొన్నేళ్లుగా చూస్తే భారతదేశంలో ధనవంతుల సంఖ్య బాగా పెరిగింది. నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక ప్రకారం 2021 సంవత్సరంలో భారతదేశంలో అల్ట్రా హై నెట్ వర్త్ వ్యక్తులలో 11 శాతం పెరుగుదల ఉంది. దీని తరువాత వారి సంఖ్య 13 వేల 637 కు పెరిగింది.

బిలియనీర్ల విషయంలో భారత్ ప్రపంచంలోనే మూడో స్థానంలో నిలిచింది. ఈ రేసులో ౭౪౮ బిలియనీర్లతో అమెరికా మొదటి స్థానంలో ఉండగా, 554 బిలియన్లతో చైనా రెండో స్థానంలో, 145 బిలియన్లతో భారత్ మూడో స్థానంలో ఉన్నాయి. 2020 సంవత్సరంలో భారతదేశంలో అల్ట్రా హై నెట్ వర్త్ వ్యక్తుల సంఖ్య 12287గా ఉంది. ఇది గత సంవత్సరం 2021లో 13637కి పెరిగింది. ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ తన తాజా నివేదికను విడుదల చేసింది.

దీని ప్రకారం గత సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా అల్ట్రా హై నెట్ వర్త్ వ్యక్తుల సంఖ్య 9 శాతం పెరిగింది. 2020లో వారి మొత్తం సంఖ్య 558828 కాగా ఈసారి వారి మొత్తం సంఖ్య 610569. దీని ప్రకారం బిలియనీర్స్ క్లబ్‌లో ఆసియా దేశాల ఆధిపత్యం నిరంతరం పెరుగుతోంది. భారతదేశంలోని వివిధ నగరాల్లో బెంగళూరు అత్యధికంగా 17.1 శాతం వృద్ధిని సాధించింది. ఢిల్లీలో హెచ్‌ఎన్‌ఐలో 12.4 శాతం పెరుగుదల ఉంది. ముంబైలో వారి సంఖ్య 9 శాతం పెరిగింది.

Tags:    

Similar News