శ్రీహరికోట నుంచి గగన తలంలోకి దూసుకెళ్లనున్న జీఎస్ఎల్వీ రాకెట్
ISRO: ఈరోజు ఉదయం 10:42 నిమిషాలకు ప్రయోగం
శ్రీహరికోటనుంచి గగన తలంలోకి దూసుకెళ్లనున్న జీఎస్ఎల్వీ రాకెట్
ISRO: ఇవాళ గగన తలంలో అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ గగన తలానికి ఉపగ్రహాన్ని ప్రయోగించబోతోంది. శ్రీహరికోటలోని సతీష్ థావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈరోజు ఉదయం 10:42 నిమిషాలకు GSLV F-12 రాకెట్ ను ప్రయోగించునున్నారు. ఈ రాకెట్ ద్వారా నావిగేషన్ వ్యవస్థకు చెందిన 2,232 కిలోల బరువు గల NVA-01 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ అధ్యక్షతన లాంచింగ్ ఆథరైజేషన్ బోర్డు ప్రతినిధులు రాకెట్ ప్రయోగ ప్రక్రియలో భాగస్వామ్యమయ్యారు.
మిస్సైల్ మ్యాన్ ఏపీజే అబ్ధుల్ కలాంను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఛైర్మన్ సోమనాథ్ పిలుపునిచ్చారు. 28 రాష్ట్రాలకు చెందిన 56 మంది విద్యార్థులను యంగ్ సైంటిస్టులుగా ఎంపిక చేసి స్పేస్ టెక్నాలజీపై అవగాహన కల్పిస్తున్నారు. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ కేంద్ర శ్రీహరికోట బ్రహ్మప్రకాశ్ హాలునుంచి ఇస్రో ఛైర్మన్ సోమనాథ్‌తో వర్చువల్ విధానంతో ముఖాముఖి నిర్వహించారు. రాకెట్లు , ఉపగ్రహాలు, ఆర్బిట్లు అంతరిక్ష సైన్సులో కీలకమన్నారు. విద్యార్థి దశనుంచే విషయ పరిజ్ఞానం పెంపొందించుకుంటే స్పేస్ సైన్స్‌తో అద్భుతాలను ఆవిష్కరించవచ్చని యువ శాస్త్రవేత్తలకు షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ సూచించారు.