Parliament Session : జూన్ 24 నుంచి జులై 3 వరకు పార్లమెంట్ సమావేశాలు
Parliament Session: పార్లమెంట్‌లో 18వ లోక్‌సభ ఈనెల 24న తొలిసారి కొలువుదీరనుంది.
Parliament Session : జూన్ 24 నుంచి జులై 3 వరకు పార్లమెంట్ సమావేశాలు
Parliament Session: పార్లమెంట్‌లో 18వ లోక్‌సభ ఈనెల 24న తొలిసారి కొలువుదీరనుంది. ఈ విషయాన్ని పార్లమెంట్ వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్ రిజిజు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రకటించారు.
నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జులై 3వ తేదీ వరకు జరగనున్న ఈ సమావేశాల్లో స్పీకర్ ఎన్నిక, రాష్ట్రపతి ప్రసంగం, ఇతర కీలక అంశాలపై చర్చలు జరుగుతాయన్నారు. రాజ్యసభ 264వ సెషన్ 27వ తేదీన ప్రారంభం కానున్నట్లు వివరించారు.
జూన్ 27న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈసందర్భంగా వచ్చే ఐదేళ్లకు ప్రభుత్వ రోడ్ మ్యాప్‌ను ఆమె వెల్లడించనున్నారు.