wayanad: వయనాడ్‌లో రోజు రోజుకు పెరుగుతున్న మృతుల సంఖ్య
wayanad: కొండచరియలు విరిగిపడిన ఘటనలో 308కి చేరిన మృతులు
wayanad: వయనాడ్‌లో రోజు రోజుకు పెరుగుతున్న మృతుల సంఖ్య
wayanad: కేరళలోని వయనాడ్‌లో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 308కు చేరింది. ఇంకా సుమారు 300మంది ఆచూకీ దొరకలేదని అధికారులు తెలిపారు. మరోవైపు 40 బృందాలు నాలుగో రోజు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఇతర సహాయ బృందాలు కూడా రెస్క్యూ ఆపరేషన్‌లో నిమగ్నమయ్యాయి. ఇండ్లను బురద కమ్మేయడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. మట్టిని తొలగిస్తున్న కొద్దీ.. శవాల గుట్టలు బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు వందలాది మందిని కాపాడి సురక్షిత శిబిరాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు.