Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు కస్టడీ విధించిన కోర్టు
Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణకు జూన్6 వరకు సిట్ కస్టడీ
Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు కస్టడీ విధించిన కోర్టు
Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను జూన్ 6 వరకు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ బెంగుళూరు కోర్టు గురువారం నాడు ఆదేశాలు జారీ చేసింది .అశ్లీల వీడియోల కేసులో ప్రధాన నిందితుడైన ప్రజ్వల్ తన నియోజకవర్గం హాసనలో ఎన్నిక ముగియగానే విదేశాలకు వెళ్లిపోయారు. దాంతో అతడిని స్వదేశానికి రప్పించేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేశారు. స్వదేశానికి వచ్చి విచారణకు సహకరించాలని జేడీఎస్ పెద్దలు దేవెగౌడ, కుమారస్వామి హెచ్చరించిన నేపథ్యంలో.. జర్మనీ నుంచి బెంగళూరు ఎయిర్‌పోర్టుకు వచ్చిన అతడిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం బెంగళూరులోని కోర్టు ముందు హాజరుపర్చారు. పోలీసులు 14 రోజుల కస్టడీ కోరగా.. ప్రస్తుతం కోర్టు అతడికి ఏడు రోజుల కస్టడీ విధించింది. అతడిని అరెస్టు చేసిన సిబ్బంది అంతా మహిళలే.