సింఘు సరిహద్దులో ఉద్రిక్తత.. రైతుల గుడారాలను తొలగిస్తున్న స్థానికులు

* రైతులు, స్థానికులకు మధ్య తోపులాట * రైతుల గుడారాలను తొలగిస్తున్న స్థానికులు * పరస్పరం రాళ్లదాడి, పరిస్థితి ఉద్రిక్తం

Update: 2021-01-29 09:39 GMT

farmers Protest in Delhi (file image)

సింఘు బోర్డర్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. స్థానికులుగా చెప్పుకుంటున్న కొందరు రైతులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. రైతులు అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. రైతులకు వ్యతిరేకంగా వచ్చిన స్థానికులు ఖలిస్తాన్ మురాదాబాద్‌ అంటూ నినాదాలు చేశారు. జాతీయ జెండాను అవమానపరిస్తే ఊరుకునేది లేదంటూ రైతులను హెచ్చరించారు. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దీంతో రంగంలో దిగిన పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. జనాలను చెదరగొట్టారు. టియర్ గ్యాస్ షెల్స్‌ ఉపయోగించి గుంపులను చెల్లాచెదురు చేశారు.

ప్రభుత్వం RSS నాయకులను సింఘు బోర్డర్‌ వద్దకు పంపించి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేలా చేస్తోందని కిసాన్ మజ్‌దూర్ సంఘటన్‌ కమిటీ నేత సత్నామ్‌ సింగ్ పన్నూ ఆరోపిస్తున్నారు. ప్రాణాలైనా వదులుతాంగానీ..ఉద్యమాన్ని ఆపేదిలేదని రైతు నాయకులు స్పష్టం చేశారు. రైతు సోదరులపై పెడుతున్న కేసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని రైతు నాయకులు డిమాండ్ చేస్తున్నారు. గణతంత్ర దివస్‌ రోజున రైతులు హింసకు పాల్పడలేదని...తమపై కుట్ర జరుగుతోందని వారు ఆరోపించారు.

Tags:    

Similar News