ఉత్తరప్రదేశ్ లో దారుణం.. పూజారిపై కాల్పులు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోండాలో దారుణం జరిగింది. భూ వివాదం కారణంగా ఆలయ పూజారిపై కాల్పులకు పాల్పడ్డారు దుండగులు. శనివారం రాత్రి ఇటియా థోక్..

Update: 2020-10-11 10:09 GMT

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోండాలో దారుణం జరిగింది. భూ వివాదం కారణంగా ఆలయ పూజారిపై కాల్పులకు పాల్పడ్డారు దుండగులు. శనివారం రాత్రి ఇటియా థోక్ పోలీస్ స్టేషన్ పరిధిలో గోండాలో ఈ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, భూ వివాదానికి సంబంధించి గుర్తుతెలియని వ్యక్తులు పూజారిపై కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో గాయపడిన పూజారిని సామ్రాట్ దాస్ గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఘటనపై గోండా పోలీసు సూపరింటెండెంట్ శైలేష్ కుమార్ పాండే మాట్లాడుతూ..

'గోండాలోని ఇటియా థోక్ లోని ఒక గ్రామంలోని ఆలయ పూజారిపై నిన్న రాత్రి కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలైన పూజారిని ఆసుపత్రిలో చేర్పించారు. ఇందులో నలుగురిపై కేసు నమోదైంది. నిందితులకు పూజారితో భూవివాదం నడుస్తుంది. ఈ దిశగా దర్యాప్తు చేస్తున్నాము.' అని అన్నారు. ఇదిలావుంటే మరో సంఘటనలో, రాజస్థాన్ కరౌలి జిల్లాలో ఒక పూజారిని సజీవ దహనం చేశారు. గురువారం రాత్రి కాలిన గాయాలతో ఓ పూజారి మరణించాడు. దీంతో కైలాష్ మీనా అనే అనుమానిత ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.. ప్రస్తుతం పూజారిపై దాడి చేసి సజీవ దహనం చేసిన ఇతర నిందితులను పట్టుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Tags:    

Similar News