Swati Maliwal: నాన్న ఇంట్లోకి వస్తున్నాడంటేనే భయపడేదానిని
Swati Maliwal: నా తండ్రి తరచుగా లైంగికంగా వేధించేవాడు
Swati Maliwal: నాన్న ఇంట్లోకి వస్తున్నాడంటేనే భయపడేదానిని
Swati Maliwal: ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మాలివాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కూడా చిన్నతనంలో తండ్రి నుంచి లైంగిక వేధింపులకు బలయ్యానని కీలక వ్యాఖ్యలు చేశారు. తన చిన్నతనంలో తండ్రి తనను లైంగికంగా వేధింపులకు గురిచేసేవాడని తెలిపారు. తన తండ్రి తరచూ లైంగికంగా వేధించేవాడని..ఆయన ఇంట్లోకి వస్తేనే భయపడేదాన్నని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఇంకా ఆ విషయాలు గుర్తున్నాయని...దాంతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని స్వాతి మాలివాల్ అన్నారు. అలాంటి వాళ్లకు ఏం చేయాలనేది తాను అప్పుడే ఆలోచించానన్నారు. అలాంటి చీకటి రోజులను తానెప్పుడూ మర్చిపోలేని తెలిపారు.