West Bengal: మమతా బెనర్జీ 66 ఏళ్ల అంటీ.. సీఎం దీదీపై సువేందు ఫైర్

West Bengal: బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై బీజేపీ నేత సువేందు తీవ్ర విమర్శలు చేశారు.

Update: 2021-04-01 15:51 GMT
సువెందు ఫైల్ ఫోటో 

West Bengal: బెంగాల్‌లోని నందిగ్రామ్‌లో పోరు ఉత్కంఠభరితంగా సాగింది. పోలింగ్ సమయంలో సీఎం మమత ఒక కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా గవర్నర్ జగదీప్ ధన్కర్‌కు అక్కడి నుంచే నేరుగా ఫోన్ చేసి మాట్లాడారు. సామాన్య ప్రజానీకాన్ని పోలింగ్ బూత్‌లోకి రానివ్వడం లేదని... ఓటు హక్కును వినియోగించుకోనివ్వడం లేదని ఫిర్యాదు చేశారు.. దయచేసి ఈ సమస్యపై దృష్టి సారించండని సీఎం మమత ఫోన్‌లో గవర్నర్‌ను కోరారు. యూపీ, బీహార్ ప్రాంతాల నుంచి వచ్చిన వారు పోలింగ్ బూత్‌ ముందు నానా హంగామా సృష్టిస్తున్నారని దీదీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలింగ్ కేంద్రం నుంచే సీఎం మమత నేరుగా గవర్నర్‌కు ఫోన్ చేయడంపై ఆమె ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి సువేందు కౌంటర్ ఇచ్చారు. మమత గవర్నర్‌తో మాట్లాడారు. ఇబ్బందేమీ లేదు. ఎన్నికలను నిర్వహించేది ఎన్నికల సంఘం. గవర్నర్ కాదని సువేందు కామెంట్ చేశారు. సీఎం మమత చేసింది చట్ట విరుద్ధమని.. రెండు గంటల పాటు పోలింగ్‌ను ఆపి డ్రామా ఆడారని మండిపడ్డారు. ఓటర్లను సీఎం మమత అవహేళన చేస్తున్నారని... నందిగ్రామ్ ఓటర్లను కించపరచడం సీఎం మమతకు అలవాటుగా మారిందని మండిపడ్డారు. 

Tags:    

Similar News