ఎస్సీ, ఎస్టీ సవరణ చట్టాన్నిసమర్థించిన సుప్రీంకోర్టు

ఎస్సీ / ఎస్టీ సవరణ చట్టాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది.. కొత్త చట్టానికి ముందస్తు బెయిల్ నిబంధనలు అంటూ ఏమి లేవని తెలిపింది.

Update: 2020-02-10 07:33 GMT

ఎస్సీ / ఎస్టీ సవరణ చట్టాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది.. కొత్త చట్టానికి ముందస్తు బెయిల్ నిబంధనలు అంటూ ఏమి లేవని తెలిపింది. షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల (దారుణాల నివారణ) సవరణ చట్టం యొక్క రాజ్యాంగ ప్రామాణికతను సుప్రీంకోర్టు సోమవారం సమర్థించింది. ఈ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందు ప్రాథమిక విచారణ అవసరం లేదని,

అలాగే సీనియర్ పోలీసు అధికారుల అనుమతి కూడా అవసరం లేదని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఎస్సీ / ఎస్టీ చట్టంపై అభియోగాలు మోపబడిన నిందితులకు ముందస్తు బెయిల్ ఇవ్వడం కూడా ఈ చట్టంలో లేదు. అయినప్పటికీ, కోర్టులు అసాధారణమైన పరిస్థితులలో ఎఫ్ఐఆర్లను రద్దు చేయవచ్చు అని పేర్కొన్నారు.

జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ జస్టిస్.. జస్టిస్ అరుణ్ మిశ్రా ఉత్తర్వుకు ప్రత్యేక ఉత్తర్వును జోడించారు.. బెయిల్ నిరాకరించడం అంటే న్యాయాన్ని మిస్ క్యారేజ్ చెయ్యడమే అర్ధం.. అని అసాధారణ పరిస్థితులలో మాత్రమే అరెస్టుకు ముందు బెయిల్ మంజూరు చేయాలని జోడించారు.

కాగా అరెస్టుకు ముందు పోలీసులు జరిపిన ప్రాథమిక దర్యాప్తుపై ఇచ్చిన ఉత్తర్వులను కూడా ధర్మాసనం గుర్తుచేసుకుంది. మార్చి 20, 2018 తీర్పులో ఇద్దరు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఈ చట్టం కింద దాఖలు చేసిన ఫిర్యాదుపై ఆటోమేటిక్ అరెస్ట్ ఉండదని తేల్చి చెప్పింది. మార్చి 20, 2018 న ఆమోదించిన ఉత్తర్వులను సమీక్షించాలని కోరుతూ కేంద్రం సుప్రీంకోర్టు ముందు సమీక్ష పిటిషన్ దాఖలు చేసింది.

Tags:    

Similar News