Supreme Court: ఐఏఎస్ కోచింగ్ సెంటర్లపై సుప్రీంకోర్టు సీరియస్
Supreme Court: కోచింగ్ సెంటర్లు డెత్ ఛాంబర్లుగా మారాయి
Supreme Court: ఐఏఎస్ కోచింగ్ సెంటర్లపై సుప్రీంకోర్టు సీరియస్
Supreme Court: ఢిల్లీలోని IAS కోచింగ్ సెంటర్‌లపై సుప్రీంకోర్ట్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కోచింగ్ సెంటర్లు డెత్ ఛాంబర్లుగా మారుతున్నాయని ఫైర్ అయ్యింది. ఓ కోచింగ్ సెంటర్‌లోని బేస్‌మెంట్‌లోకి వరద పోటెత్తి ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటన సంచలనంగా మారింది. ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించిన సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన న్యాయస్థానం.. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోచింగ్ సెంటర్లను నియంత్రించడంలో అధికారులు విఫలమయ్యారని మండిపడింది. కోచింగ్ సెంటర్లను ఎలాంటి నిబంధనల ప్రకారం నిర్వహిస్తున్నారో న్యాయస్థానానికి వివరించాలంటూ కేంద్రం, దిల్లీ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.