Supreme Court: ఈడీ, సీబీఐ తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి

Supreme Court: ప్రజా ప్రతినిధులపై పెట్టిన కేసుల దర్యాప్తులో మితిమీరిన ఆలస్యం జరుగుతుండడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి...

Update: 2021-08-26 08:00 GMT

ఈడీ, సీబీఐ తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి

Supreme Court: ప్రజా ప్రతినిధులపై పెట్టిన కేసుల దర్యాప్తులో మితిమీరిన ఆలస్యం జరుగుతుండడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై ఈడీ, సీబీఐలు కేసులు నమోదు చేస్తున్నా, వాటికి ఎప్పటికీ ముగింపు ఉండడం లేదని ఆక్షేపించింది. ఇందుకోసం అవసరమైన మానవ వనరులు, ఇతర సదుపాయాలను కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.

ప్రజాప్రతినిధులపై పెట్టిన కేసులను త్వరగా విచారించాలని, నేరం రుజువైతే వారు జీవితకాలం పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలంటూ బీజేపీ నాయకుడు అశ్విన్‌ ఉపాధ్యాయ దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్య చేసింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతోంది. దర్యాప్తులో ఏమైనా ఉంది అని తేలితే వెంటనే ఛార్జిషీట్ దాఖలు చేయండి నిందితుల తలపై కత్తిని వేలాడదీయొద్దు ఏవైనా తప్పులుంటే వెంటనే విచారణ వేగవంతం చేయండని జస్టిస్‌ రమణ వ్యాఖ్యానించారు. 

Tags:    

Similar News