Nirbhaya Case: ముఖేష్ పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
ఢిల్లీలో నిర్భయపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో మరణశిక్ష విధించిన నలుగురిలో ఒకరైన ముఖేష్ కుమార్ సింగ్ దాఖలు చేసిన సవాల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది.
ఢిల్లీలో నిర్భయపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో మరణశిక్ష విధించిన నలుగురిలో ఒకరైన ముఖేష్ కుమార్ సింగ్ దాఖలు చేసిన సవాల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. ఈ మేరకు జస్టిస్ ఆర్. బానుమతి నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం, రాష్ట్రపతి.. క్షమాబిక్ష అభ్యర్థనను త్వరితగతిన తేల్చడం అంటే మనస్సును అన్వయించుకోవడం కాదని పేర్కొంది. ట్రయల్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులు ప్రకటించిన తీర్పులతో సహా అన్ని సంబంధిత విషయాలను రాష్ట్రపతి ముందు ఉంచినట్లు ధర్మాసనం తెలిపింది.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అప్పగించిన అధికారిక నోట్ ఉన్న ఫైళ్ళను పరిశీలించామని.. క్షమాబిక్ష పిటిషన్ను కొట్టివేసే ముందు అన్ని సంబంధిత రికార్డులు పరిగణించబతాయని కోర్టు తేల్చింది. కాగా ముఖేష్ పిటిషన్ను రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద దాఖలు చేశాడు. డెత్ వారెంట్ అమలును నిలిపివేయాలని అతను పిటిషన్ లో కోరాడు. వాస్తవానికి ఫిబ్రవరి 1 న అతని మరణశిక్ష విధించాలని సెషన్స్ కోర్టు ఆదేశించింది.