శబరిమలలో మహిళల ప్రవేశంపై సుప్రీం కోర్టులో విచారణ

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఐ బొబ్డే నేతృత్వంలోని తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం మరోసారి శబరిమల అంశంపై విచారణ ప్రారంభించింది.

Update: 2020-02-03 06:49 GMT

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఐ బొబ్డే నేతృత్వంలోని తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం మరోసారి శబరిమల అంశంపై విచారణ ప్రారంభించింది. శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం కేసుతో పాటు.. మతపరమైన వివక్షకు సంబంధించిన ఇతర సంబంధిత కేసులను కూడా ధర్మాసనం విచారిస్తోంది. నమాజ్ చేసేందుకు మహిళలు మసీదులలోకి ప్రవేశించే అంశం తోపాటు.. పార్సీ, దావూద్ బొహ్రా వర్గాలకు చెందిన మహిళలకు సంబంధించిన మరో రెండు కేసుల ను కూడా సోమవారం విచారణకు స్వీకరించింది ధర్మాసనం.

ఈ ధర్మాసనం జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ మోహన్ ఎం శాంతనగౌడర్, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి,, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌లు ఉన్నారు. మత విశ్వాసాలు, మహిళల ప్రవేశంపై న్యాయ సమీక్ష పరిధిని సుప్రీంకోర్టు పరిశీలించనుంది. శబరిమల సహా ఇతర ప్రార్థనా మందిరాల్లోకి ప్రవేశంపై మొత్తం 64 పిటిషన్లు దాఖలు అయ్యాయి.

Tags:    

Similar News