రాష్ట్రంలో అల్లర్లు, నిరసనలకు ఆ రెండు పార్టీలు కారణం: స్టాలిన్

రాష్ట్రంలో అల్లర్లు, నిరసనలు, కాల్పులకు ఎఐఎడిఎంకె, బిజెపి కారణమని డీఎంకె అధినేత ఎంకే స్టాలిన్ ఆరోపించారు.

Update: 2020-02-02 07:12 GMT

రాష్ట్రంలో అల్లర్లు, నిరసనలు, కాల్పులకు ఎఐఎడిఎంకె, బిజెపి కారణమని డీఎంకె అధినేత ఎంకే స్టాలిన్ ఆరోపించారు. పౌరసత్వ చట్టానికి మద్దతుగా ఎఐఎడిఎంకె, ఎంపిలు ఓటు వేయకపోతే ఈ చట్టాన్ని సమాఖ్య ప్రభుత్వం ఆమోదించదని స్టాలిన్ అన్నారు. అంతేకాకుండా, ఈ చట్టాన్ని రద్దు చేయాలని రాజకీయ పార్టీలు, మైనారిటీ ప్రజల డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం తీసుకోలేదని స్టాలిన్ విమర్శించారు. కానీ వారి పోరాటం ఎప్పటికీ అంతం కాదని హెచ్చరించారు.

మైనారిటీ జనాభా తోపాటు ఈలం తమిళులను ప్రమాదంలో పడేసే పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా డీఎంకె మొదటి నుంచీ స్వరం వినిపిస్తున్నట్లు స్టాలిన్ స్పష్టం చేశారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నందున, ఎన్‌సిఆర్, ఎన్‌పిఆర్ లు నిలిచిపోయాయని.. పౌర చట్టం విషయంలో హోంమంత్రి అమిత్ షా చాలా అహంకారంతో ఉన్నారని.. ఈ విషయంలో డీఎంకే తరపున నిరసనలు కొనసాగిస్తామని స్టాలిన్ వెల్లడించారు.

మరోవైపు బడ్జెట్ 2020 పై మాట్లాడిన స్టాలిన్.. మరోసారి ప్రజల్ని కేంద్ర ప్రభుత్వం కష్టాల్లోకి నెట్టిందని ఆరోపించారు. కార్పొరేట్ సంస్థలకే కొమ్ముకాశారని.. ఈ బడ్జెట్ వలన పేదలకు ప్రయోజనం చేకూరుతుందని అనుకోవడం లేదన్నారు. కేంద్ర ఆర్థిక నివేదిక రాష్ట్ర సంస్థలను ప్రైవేటు రంగానికి ఆకర్షించడానికి ఉద్దేశించినదని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్తును "రైతుల సౌర విద్యుత్ మోటారు" అని పిలవడానికి ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. విద్యార్థుల - ముఖ్యంగా దిగువ, గిరిజన విద్యార్థుల విద్యను అణగదొక్కడం ద్వారా సామాజిక న్యాయ విధానం నిర్మాణానికి భంగం కలిగించాలని బిజెపి ప్రయత్నిస్తోంది.

వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత రాష్ట్రాలలో ఒకటైన తమిళనాడుకు మౌలిక సదుపాయాల నిధులు లేవు. అలాగే రైల్వే ప్రాజెక్టులను కూడా కేటాయించలేదని అన్నారు. రైతుల ఆదాయాన్ని మెరుగుపర్చడానికి.. ప్రస్తుతం ఉన్న ఉద్యోగాలను నిలుపుకుంటూ భవిషత్ లో ఉపాధి కల్పించడానికి ఎటువంటి పథకం లేదని స్టాలిన్ అన్నారు. ఆర్థిక స్తబ్దతతో సహా పలు సమస్యల నుండి ప్రజలను మళ్లించడానికి కఠినమైన చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుందని స్టాలిన్ విమర్శించారు.

Tags:    

Similar News