Ayodhya: అయోధ్య పిలుస్తోంది..!.. ఈ నెల 29 నుంచి ప్రత్యేక రైళ్లు.. నియోజకవర్గాలవారీగా అయోధ్యకు భక్తులు

Ayodhya: నల్గొండ, భువనగిరి, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం..

Update: 2024-01-23 03:49 GMT

Ayodhya: అయోధ్య పిలుస్తోంది..!.. ఈ నెల 29 నుంచి ప్రత్యేక రైళ్లు.. నియోజకవర్గాలవారీగా అయోధ్యకు భక్తులు

Ayodhya: అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కన్నుల పండువగా జరిగింది. బాలరాముడి దర్శనం కోసం నేటి నుంచి భక్తులను అనుమతించనున్నారు. ఇప్పటికే ఆయోధ్యకు భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్య రాయుడి ధర్శనం కోసం వెళ్లే వారి కోసం బీజేపీ ఓ అడుగు ముందుకు వేసింది. ఈనెల 29నుంచి అయోధ్యకు తెలంగాణ నుంచి రైళ్లు నడపాలని నిర్ణయించిన్టు తెలుస్తుంది.

తెలంగాణలోని ప్రతి ఎంపీ నియోజకవర్గం నుంచి ప్రజలను తీసుకెళ్లాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా.. ఆయా పార్లమెంట్ పరిధిలోని ఒక్కో అసెంబ్లీ నుంచి 200 మందికి అవకాశం కల్పించనున్నారు. ఇప్పటికే రామ భక్తుల కోసం ట్రైన్స్‌ని బుక్ చేసినట్టు తెలుస్తుంది. కాగా.. అయోధ్యకు వెళ్ళి రావడానికి 5 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ప్రతి బోగికి ఒక ఇంఛార్జి... ప్రతి రైలుకు 20బోగీలు ఏర్పాటు చేసేందుకు కసరత్తుచేస్తోంది బీజేపీ. ఈ లెక్కన ఒక్కో ట్రైన్‌లో 14 వందల మందికి రాముడి దర్శనం కల్పించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

జనవరి 29న తొలి ట్రైన్ బయలుదేరనుంది. సికింద్రాబాద్, ఖాజీపేట నుంచి ట్రైన్లు ప్రారంభం కానున్నాయి. జనవరి 29న సికింద్రాబాద్ ఎంపీ పరిధిలోని ప్రజలకు అవకాశం ఇవ్వగా.. జనవరి 30న వరంగల్, జనవరి 31న హైదరాబాద్ ఇలా ప్రతి రోజు ప్రతి నియోజకవర్గానికి చెందిన వారికి అవకాశం ఇవ్వనున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, ఆదిలాబాద్, నిజామాబాద్, జహీరాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, మల్కాజ్‌గిరి, మెదక్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని వారికి సికింద్రాబాద్ నుంచి ట్రైన్‌ను ఏర్పాటు చేయగా... నల్గొండ, భువనగిరి, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, పెద్దపల్లి, కరీంనగర్, పెద్దపల్లి వారికి ఖాజీపేట నుంచి ట్రైన్ బయలుదేరనున్నాయి.

Tags:    

Similar News