Pakistan-Pahalgam Links: ఇండియాలో నరమేధాన్ని సృష్టించిన ఉగ్రవాది అతడే... పాకిస్థాన్‌ లింకులు!

Pakistan-Pahalgam Links: మూసా చుట్టూ ఉన్న ముఠాలో లష్కరే తోయిబా సభ్యులు, ఇంకా స్థానిక ఓవర్‌గ్రౌండ్ వర్కర్లు ఉన్నట్టు సమాచారం.

Update: 2025-04-30 14:00 GMT

Pakistan-Pahalgam Links: ఇండియాలో నరమేధాన్ని సృష్టించిన ఉగ్రవాది అతడే... పాకిస్థాన్‌ లింకులు!

Pakistan-Pahalgam Links: పాకిస్థాన్‌ నటిస్తోంది.. తనకి ఏం సంబంధం లేదన్నట్టు ముఖం మార్చుకుంటోంది. ఎక్కడో ఎవరో చేశారు.. మేం కాదంటోంది. ఆ మాటలు సాధారణంగానే వినిపిస్తున్నా... చీకటి లోపల మాత్రం ఎండకట్టిన ప్లాన్ కనిపిస్తోంది. జమ్ముకశ్మీర్‌-పహల్గాంలో జరిగిన దారుణ దాడి తర్వాత భారత్‌ ఒక్కసారిగా ఒక్కటయింది. అమాయకుల రక్తం చిందితే, ప్రశ్నలు వెల్లువెత్తాయి. ఎవరు చేశారు? ఎందుకు చేశారు? ఎలా చేశారు? అయితే పాకిస్తాన్ మాత్రం అబద్ధాన్నే మాట్లాడుతోంది. ఇటు NIA దర్యాప్తు ఒక్కో మెట్టు ఎక్కుతుంటే... ప్రతి అడుగులోనూ ఒకే గుర్తు కనిపిస్తోంది.. అదే పాకిస్థాన్‌.. వారిదే శిక్షణ.. దాడి ఎలా జరిగిందో చూస్తే.. ఇది ఏ కేవలం ఉగ్రవాదుల పని మాత్రమే కాదని స్పష్టమవుతోంది. ఇది ఆర్మీ స్థాయి పరిజ్ఞానం, కచ్చితమైన ప్లానింగ్, మిలిటరీ తరహా చర్యలు ఈ దాడి వెనుక కనిపిస్తున్నాయి. ఇవన్నీ కలిసి ఒకే రూపాన్ని చూపిస్తున్నాయి. అతనెవరు? అతడు ఒకప్పటి పాకిస్తాన్ ఆర్మీ స్పెషల్ ఫోర్స్ కమాండో...! ఇప్పుడు ఇండియాలో నరమేధాన్ని సృష్టించిన ఉగ్రవాది. అతడే హషీం మూసా.

హషీం మూసా పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. ఒకప్పుడు పాక్‌ ఆర్మీలో పని చేసిన స్పెషల్ ఫోర్స్ కమాండో అతను. పాక్ సైన్యంలో అత్యంత గోప్యంగా పనిచేసే SSG.. అంటే Special Service Groupలో శిక్షణ పొందాడు. ఈ శిక్షణ సాధారణమైనది కాదు. శత్రువు కనిపించకుండానే దాడి చేయడం, ఎత్తయిన కొండల్లో యుద్ధం చేయడం, ఆధునిక ఆయుధాల వినియోగం లాంటివి మూసా నేర్చుకున్నాడు. ఆ తర్వాత భారత్‌పై తిరగబడ్డాడు. మొదటగా మూసాను పాక్ ఆర్మీ నుంచి లష్కరే తోయిబాకు షిఫ్ట్ అయ్యాడట. 2024లో జమ్ముకశ్మీర్‌లోకి అక్రమంగా ప్రవేశించి, చురుకుగా ఉగ్ర కార్యకలాపాలకు దిగాడు. ఇండియన్ సెక్యూరిటీ ఫోర్సెస్‌పై దాడులకు పాల్పడుతున్నాడు. ఇప్పటికే మూడు దాడుల వెనుక అతడి ప్రమేయం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. అతను తరుచుగా ప్రాంతాలు మారుతుంటాడు. పర్వతాలు, అడవుల నుంచి ఉగ్ర ఆపరేషన్లకు ప్లాన్ చేస్తుంటాడు. దాడి చేసే చోటికి వచ్చి, పనిని పూర్తిచేసి.. వెంటనే మాయమవుతాడు. అతని చేతిలో భయంకర ఆయుధాలున్నాయి.

M4 కార్బైన్ లాంటి మిలిటరీ గన్స్ ఉపయోగించాడు. ఇవి పాక్ ఆర్మీ నుంచి లభించినవేనన్నది స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థలు, రాష్ట్ర పోలీస్ విభాగాలు, ఆర్మీ..ఇలా అందరూ హషీం మూసాను పట్టుకోవడానికి భారీ వేట మొదలుపెట్టారు. మూసా ఆచుకీ చెబితే 20 లక్షల రూపాయల రివార్డు ఇస్తామని జమ్ముకశ్మీర్ పోలీసులు ప్రకటించారు. ఇక మూసా చుట్టూ ఉన్న ముఠాలో లష్కరే తోయిబా సభ్యులు, ఇంకా స్థానిక ఓవర్‌గ్రౌండ్ వర్కర్లు ఉన్నట్టు సమాచారం. అతడి దాడులు పాక్ ప్రభుత్వం అనుమతితో, సహకారంతో జరుగుతున్నాయన్నది భారత్‌ ప్రభుత్వ వాదనగా తెలుస్తోంది. ఇండియాను అస్థిరం చేయాలనే కుట్రలో భాగంగానే మూసాను పాక్‌ భారత్‌పైకి ఎగదోస్తుందట.

Tags:    

Similar News