Ayodhya Ram Temple: మేము రాం.. రామమందిర ప్రారంభోత్సవంపై కాంగ్రెస్ సంచలన నిర్ణయం
Ayodhya Ram Temple: నిర్మాణపనులు పూర్తి కాకుండానే ప్రారంభిస్తున్నారని ఎద్దేవా
Ayodhya Ram Temple: మేము రాం.. రామమందిర ప్రారంభోత్సవంపై కాంగ్రెస్ సంచలన నిర్ణయం
Ayodhya Ram Temple: అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి దూరంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ లేఖ విడుదల చేశారు. రాజకీయ లబ్ది కోసం అయోధ్య రామమందిరాన్ని ఆర్‌ఎస్‌ఎస్,బీజేపీలు వాడుకుంటున్నాయని సోనియాతో పాటు ఖర్గే, అధీర్ రంజన్ చౌదరి దుయ్యబట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో లబ్ది పొందడం కోసమే రామమందిర నిర్మాణ పనులు పూర్తికాకుండానే ప్రారంభించేందుకు కేంద్రం సిద్ధమైందని ఎద్దేవా చేశారు. రామమందిర నిర్మాణం బీజేపీ పార్టీ సొంత కార్యక్రమంలా నిర్వహిస్తుందని... అందుకే ప్రారంభోత్సవ వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు సోనియా లేఖలో పేర్కొన్నారు.