Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లో కురుస్తున్న మంచు వర్షం
Jammu and Kashmir: రాజోరి, పూంచ్‌లను కలిపే మొఘల్ రోడ్డు మూసివేత
Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లో కురుస్తున్న మంచు వర్షం
Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లో మంచు వర్షం కురుస్తుంది. రాజధాని శ్రీనగర్ సహా కాశ్మీర్‌లోని పలు జిల్లాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. చలిగాలుల వల్ల జనజీవనం స్తంభించింది. శ్రీనగర్‌లో పగటి ఉష్ణోగ్రత సాధారణం కంటే కొంచెం తక్కువగా 8.4 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. గత రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత మైనస్ 1.3 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. హిమపాతం కారణంగా షోపియాన్ జిల్లా రాజోరి, పూంచ్‌లను కలిపే మొఘల్ రోడ్డు మూసివేయబడింది.