Petrol Prices: స్వల్పంగా తగ్గిన పెట్రోల్ డీజిల్ ధరలు

Petrol Prices: లీటరు పెట్రోల్ పై 21 పైసలు, డీజిల్‌ పై 20 పైసలు చొప్పున ధరను తగ్గిస్తున్నట్టు చమురుసంస్థలు ప్రకటించాయి.

Update: 2021-03-25 04:31 GMT

Petrol Prices: (ఫైల్ ఇమేజ్)

Petrol Prices: మొత్తానికి వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల దెబ్బకు పెట్రోల్ ధరలు స్వల్పంగా దిగి వస్తున్నాయి. వరుసగా రెండో రోజూ పెట్రోలు,డీజిల్ ధరలు తగ్గాయి. నేడు లీటరు పెట్రోల్ పై 21 పైసలు, డీజిల్‌ పై 20 పైసలు చొప్పున ధరను తగ్గిస్తున్నట్టు ప్రభుత్వ రంగ చమురుసంస్థలు ప్రకటించాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చమురు సంస్థలు వెల్లడించాయి.

ఇక తాజా మార్పు తరువాత ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు రూ. 90.99 నుంచి రూ. 90.78కు తగ్గగా, డీజిల్ ధర రూ. 81.30 నుండి రూ. 81.10కు తగ్గింది. ఇతర నగరాల్లో ధరలను పరిశీలిస్తే, ముంబైలో పెట్రోలు రూ. 97.19కు, డీజిల్‌ రూ. 88.20కుచేరగా, చెన్నైలో పెట్రోల్‌ రూ. 92.77, డీజిల్‌ రూ. 86.10కు చేరింది. హైదరాబాద్‌ లో పెట్రోల్‌ ధర రూ. 94.39గా ఉండగా, డీజిల్‌ ధర రూ.88.45కు తగ్గింది.

Tags:    

Similar News