Shivamogga Bus Fire Accident: మంటల్లో చిక్కుకున్న ట్రావెల్స్ బస్సు.. లోపల 36 మంది ప్రయాణికులా?

Shivamogga Bus Fire Accident: శివమొగ్గ జిల్లా సుదూర్ సమీపంలో నాన్-ఏసీ స్లీపర్ ట్రావెల్స్ బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. 36 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

Update: 2026-01-28 06:08 GMT

Shivamogga Bus Fire Accident: మంటల్లో చిక్కుకున్న ట్రావెల్స్ బస్సు.. లోపల 36 మంది ప్రయాణికులా?

Shivamogga Bus Fire Accident: శివమొగ్గ జిల్లాలో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. హోసనగర నుంచి బెంగళూరు వెళ్తున్న శ్రీ అన్నపూర్ణేశ్వరి ట్రావెల్స్‌కు చెందిన నాన్-ఏసీ స్లీపర్ బస్సు మంగళవారం రాత్రి (జనవరి 27, 2026) హోసనగర తాలూకాలోని సుదూర్ సమీపంలో మంటల్లో పూర్తిగా కాలిపోయింది.

బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నారు. సుదూర్‌కు చేరుకుంటున్న సమయంలో డ్రైవర్ క్యాబిన్‌లో నుంచి పొగలు రావడం గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమయ్యాడు. రాత్రి సుమారు 10.30 గంటల సమయంలో బస్సును రోడ్డుపక్కన ఉన్న చెట్టును ఢీకొట్టి ఆపినట్లు సమాచారం.

అప్పటికే ప్రయాణికులు నిద్రలో లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బస్సు ఆగిన వెంటనే ప్రయాణికులు కిటికీలు, ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ల ద్వారా బయటకు దిగారు. అయితే ఈ ఘటనలో డ్రైవర్, కండక్టర్ సహా ముగ్గురికి కాలిన గాయాలు కాగా, మరికొందరికి స్వల్ప గాయాలు అయ్యాయి.

సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర సేవల బృందాలు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనపై శివమొగ్గ జిల్లా ఎస్పీ బి. నిఖిల్ స్పందిస్తూ, “ఇది నాన్-ఏసీ బస్సు కావడంతో ప్రయాణికులు వెంటనే బయటకు రావడానికి అవకాశం లభించింది. దీంతో భారీ ప్రాణనష్టం తప్పింది” అని తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News