IT Notice To Sharad Pawar: శరద్ పవార్ కు తొలి షాక్.. ప్రేమ లేఖ అందిందంటూ..
మహారాష్ట్రలో ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయిన వెంటనే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు తొలి షాక్ తగిలింది.
IT Notice To Sharad pawar: శరద్ పవార్ కు తొలి షాక్.. ప్రేమ లేఖ అందిందంటూ..
IT Notice To Sharad Pawar: మహారాష్ట్రలో ఎన్సీపీ,శివసేన,కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయిన వెంటనే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు తొలి షాక్ తగిలింది. నిన్న రాత్రి ఆయనకు ఐటీ శాఖ నుంచి నోటీసులు అందాయి. ఈ విషయాన్ని శరద్ పవార్ ట్విట్టర్ ద్వారా స్వయంగా వెల్లడించారు.
ఈ నోటీసులను ప్రేమ లేఖగా పేర్కొంటూ కేంద్రం పైన విమర్శలు చేశారు పవార్. పవార్ తన ట్వీట్ లో..."నాకో ప్రేమ లేఖ అందింది. 2004, 2009, 2014, 2020 ఎన్నికల సమయంలో నేను సమర్పించిన అఫిడవిట్లకు సంబంధించి ఆదాయపు పన్ను విభాగం నుంచి ఈ ప్రేమ లేఖ వచ్చింది"అని పేర్కొన్నారు పవార్. అయితే ఈ నోటీసుుల గురించి తాను ఆందోళన చేందడం లేదని, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తన వద్ద ఉన్నట్టుగా పవార్ తెలిపారు.