రైల్వే ప్రయాణికులకి అలర్ట్.. టికెట్ల సబ్సిడీలో కొత్త నిబంధనలు..!

Indian Railway: రైల్వేశాఖ త్వరలో మరో నిర్ణయం తీసుకోనుంది.

Update: 2022-08-18 15:00 GMT

రైల్వే ప్రయాణికులకి అలర్ట్.. టికెట్ల సబ్సిడీలో కొత్త నిబంధనలు..!

Indian Railway: రైల్వేశాఖ త్వరలో మరో నిర్ణయం తీసుకోనుంది. కరోనా కాలంలో రద్దు చేసిన సీనియర్ సిటిజన్లు, క్రీడాకారులతో సహా ఇతర వర్గాల ప్రయాణికుల సబ్సిడీ టిక్కెట్ల సేవను తిరిగి ప్రారంభించాలని యోచిస్తోంది. వాస్తవానికి విమర్శల తర్వాత సీనియర్ సిటిజన్లకు సబ్సిడీని పునరుద్ధరించాలని రైల్వే పరిశీలిస్తోంది. అయితే ఇది సాధారణ, స్లీపర్ కేటగిరీకి మాత్రమే ఉండే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.

ప్రభుత్వం వయస్సు ప్రమాణాలు,నిబంధనలు, షరతులను మార్చవచ్చు. 70 ఏళ్లు పైబడిన వారికి ప్రభుత్వం రాయితీతో కూడిన ఛార్జీల సౌకర్యాన్ని కల్పిస్తుంది. ఇది గతంలో 58 ఏళ్ల మహిళలు, 60 ఏళ్ల పురుషులకు అందుబాటులో ఉండేది. 2020 మార్చికి ముందు అన్ని తరగతులలో ప్రయాణించడానికి మహిళలకు 50 శాతం, పురుషులకు 40 శాతం తగ్గింపును ఇచ్చేది. రైల్వేల నుంచి ఈ మినహాయింపు తీసుకోవడానికి కనీస వయోపరిమితి వృద్ధ మహిళలకు 58, పురుషులకు 60 సంవత్సరాలు. కానీ కరోనా తరువాత వారికి అందుబాటులో ఉన్న అన్ని రాయితీలు రద్దు చేసిన సంగతి తెలిసిందే.

దీనిపై రైల్వేశాఖ ఈ విధంగా స్పందించింది "రాయితీలు వృద్ధులకు సహాయపడతాయని మేము అర్థం చేసుకున్నాం. వాటిని మేము పూర్తిగా తొలగిస్తామని ఎప్పుడూ చెప్పలేదు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. సీనియర్ సిటిజన్ల రాయితీకి సంబంధించి వయో ప్రమాణాలను 70 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే అందుబాటులో ఉంచాలని రైల్వే బోర్డు ఆలోచిస్తున్నట్లు తెలిపింది". రాయితీలను నాన్-ఏసీ తరగతి ప్రయాణానికి మాత్రమే పరిమితం చేయాలనేది రైల్వేలు పరిశీలిస్తున్న మరో నిబంధన.అన్ని రైళ్లలో 'ప్రీమియం తత్కాల్' పథకాన్ని ప్రవేశపెట్టడం అనే మరో ఎంపికను కూడా రైల్వే పరిశీలిస్తోంది. ఇది అధిక రాబడిని సంపాదించడంలో సహాయపడుతుంది. రాయితీల భారాన్ని భరించడంలో ఉపయోగపడుతుంది. ఈ పథకం ప్రస్తుతం దాదాపు 80 రైళ్లలో వర్తిస్తుంది.

Tags:    

Similar News