Supreme Court: సుప్రీంకోర్టులో నుపుర్ శర్మకు ఊరట..
Nupur Sharma: మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నబీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మకు..
Supreme Court: సుప్రీంకోర్టులో నుపుర్ శర్మకు ఊరట..
Nupur Sharma: మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నబీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మకు ఎట్టకేలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. నుపుర్ శర్మపై ఆగస్టు 10 వరకు ఎలాంటి చర్యలు చేపట్టరాదంటూ ప్రభుత్వాన్నిఆదేశించింది. అంతేకాకుండా నుపుర్ శర్మకు ప్రాణ హాని ఉందంటూ కూడా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య చేసింది. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ నుపుర్ శర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దేశవ్యాప్తంగా తనపై నమోదైన అన్ని కేసులను ఒకే కేసుగా మార్చాలని కూడా ఆమె కోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. నుపుర్ శర్మకు అనుకూలంగా ఆదేశాలు జారీ చేసింది.