West Bengal Polls 2021: దీదీతో పోటీకి సై అంటున్న దాదా!
West Bengal Polls 2021: బెంగాల్‌లో అధికారం చేజిక్కించుకోవాలని పట్టుదలతో ఉన్న బీజేపీ అందుకు తగ్గవ్యక్తి కోసం చూస్తోంది
ఇమేజ్ సౌరిస్: ద్నఇండియా.కం
West Bengal Election 2021: పశ్చిమ బెంగాల్ లో సాధారణ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుడడంతో సవాళ్లు, ప్రతి సవాళ్ళతో ఇప్పటికే రాజకీయాలు వేడెక్కాయి. బెంగాల్‌లో మమతా బెనర్జీని గద్దె దించడమే లక్ష్యంగా.. దీదీ నుంచి అధికారం చేజిక్కించుకోవాలని పట్టుదలతో పావులు కదుపుతూ ఉన్న బీజేపీ అందుకు తగ్గ సమర్థ వ్యక్తి కోసం అన్వేషిస్తోంది. ఈ క్రమంలో సౌరబ్ ను పార్టీలో చేర్చుకునేందుకు కమలనాథులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. దాదా కూడా తన రాజకీయరంగ ప్రవేశంపై వస్తున్న వార్తలను ఖండించకపోవడంతో పాటు నర్మగర్భ వ్యాఖ్యలు చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ''ఏం జరుగుతుందో చూద్దాం.. నా జీవితం గతంలో ఎన్నో అనూహ్య మలుపులు తీసుకుంది'' అంటూ గంగూలీ స్పందించడం తన ఆసక్తిని తెలియజేస్తోంది.
హాట్‌టాపిక్‌గా మారిన దాదా ఎంట్రీ..
ఇప్పటికే క్రికెట్‌లో మెరుపులు మెరిపించిన గంగూలీ బెంగాల్ దీదీ మమతకు పోటీగా గంగూలీ దిగుతున్నారన్న వార్తలు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి. పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన భారత జట్టును ముందుండి నడిపించిన ఘనత గంగూలీది. సౌరవ్ రాక టీమిండియాకు పూర్వవైభవం తెచ్చింది. తాను చేపట్టిన ప్రతి బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించిన గంగూలీ ప్రస్తుతం రాజకీయ ఆరంగ్రేటం చేస్తారన్న వార్తలు మార్మోగుతున్నాయి.
రాజకీయరంగ ప్రవేశంపై పునరాలోచన...
మరో వైపు దాదా రాజకీయ అరంగేట్రం ఖరారైనట్లు తెలుస్తోంది. ఇటీవల దాదా అనారోగ్యానికి గురయ్యారు. దీని కారణంగానే ఆయన రాజకీయరంగ ప్రవేశంపై పునరాలోచనలో పడ్డారని, లేదంటే ఇప్పటికే ప్రచారంలో బిజీగా ఉండేవారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గంగూలీ కనుక బీజేపీ పక్షం చేరితే మాత్రం.. దీదీకి మరిన్ని కష్టాలు తప్పకపోవచ్చు. మొత్తానికి నందిగ్రామ్ ఎన్నికలు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలువనుంది.