చారిత్రాత్మక విజయం సాధించిన రైతులు.. విజయ కవాతుతో స్వస్థలాలకు రైతులు

Samyukt Kisan Morcha: కొత్త సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న రైతులు ఎట్టకేలకు తమ పోరును ముగించారు.

Update: 2021-12-10 03:22 GMT

చారిత్రాత్మక విజయం సాధించిన రైతులు.. విజయ కవాతుతో స్వస్థలాలకు రైతులు

Samyukt Kisan Morcha: కొత్త సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న రైతులు ఎట్టకేలకు తమ పోరును ముగించారు. రైతుల డిమాండ్లను నెరవేర్చేందుకు కేంద్రం ఓకే చెప్పడంతోపాటు లిఖిత పూర్వక హామి ఇచ్చింది. దీంతో 15నెలలకుపైగా ఉద్యమం చేసిన రైతులు చారిత్రాత్మక విజయం సాధించారు.

రైతులు డిమాండ్‌ చేస్తున్న కనీస మద్దతు ధరపై కమిటీ ఏర్పాటుతోపాటు వారిపై నమోదైన కేసుల ఎత్తివేత, ఆందోళనల్లో మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం ఇచ్చేందుకు ఉత్తరప్రదేశ్‌, హర్యానా ప్రభుత్వాలు అంగీకరించాయి. ఇందుకు సంబంధించిన హామీ పత్రం రైతులకు అందడంతో ఉద్యమాన్ని విరమిస్తున్నట్టు 40 రైతు సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రకటించింది.

ఢిల్లీలోని తమ నిరసన శిబిరాలను ఖాళీ చేస్తోన్న రైతులు తమ ఇళ్లకు వెళ్తున్నారు. హామీలను నెరవేర్చకుంటే మళ్లీ ఉద్యమం తప్పదని హెచ్చరించారు. రైతులు విజయ కవాతుతో స్వస్థలాలకు చేరుతున్నారన్నారు రైతు నేత బల్బీర్‌ సింగ్‌ రాజేవాల్‌.

Tags:    

Similar News