బీజేపీలో చేరిన సైనా నెహ్వాల్

భారత షట్లర్ సైనా నెహ్వాల్ ఈ రోజు భారతీయ జనతా పార్టీ (బిజెపి) లో చేరారు.

Update: 2020-01-29 07:58 GMT

భారత షట్లర్ సైనా నెహ్వాల్ ఈ రోజు భారతీయ జనతా పార్టీ (బిజెపి) లో చేరారు. ఇవాళ ఉదయం ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి చేరుకున్న ఆమె పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సమక్షంలో సమక్షంలో బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. అంతకుముందు తాను బీజేపీలో చేరుతున్నట్టు వార్త సంస్థలకు సమాచారం అందించారు. హర్యానాలో జన్మించిన సైనా నెహ్వాల్ భారతదేశంలో అత్యంత విజయవంతమైన క్రీడాకారిణి. 29 ఏళ్ల సైనా.. 2015 లో 20 ఇంటర్నేషనల్‌ టైటిల్స్‌ను గెలుచుకొని.. ప్రపంచ నంబర్ 1 ర్యాంకింగ్ సాధించిన మొదటి భారతీయ మహిళా షట్లర్ గా రికార్డులకెక్కారు.

ప్రస్తుతం ఆమె తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నారు. సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ 2018 డిసెంబర్‌లో వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం ఆమె బీజేపీ లో చేరతారని వార్తలు వచ్చాయి. ఇవాళ ఆ వార్తలు నిజమయ్యాయి. ఆమెను ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించనున్నారు. ఢిల్లీకి బీజేపీ తరుపున స్టార్ కాంపైనర్ గా ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే గత ఏడాది క్రికెటర్ గౌతమ్ గంభీర్, బబితా ఫోగాట్ సహా పలువురు క్రీడాకారులు బిజెపిలో చేరిన సంగతి తెలిసిందే. 


Full View


Tags:    

Similar News