Sachin Pilot Office Sealed In Rajasthan: సచిన్‌ పైలట్‌ కార్యాలయం మూసివేత

Sachin Pilot Office Sealed In Rajasthan: రాజస్థాన్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది.. ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు సచిన్‌ పైలట్‌ కార్యాలయాన్ని మూసివేశారు. అందులో పనిచేసే ఇద్దరు సిబ్బందికి కరోనా సోకడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది

Update: 2020-07-13 08:05 GMT
Rajasthan Political Crisis: coronavirus sachin pilot office jaipur sealed after 2 staff tests positive

Sachin Pilot Office Sealed In Rajasthan: రాజస్థాన్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది.. ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు సచిన్‌ పైలట్‌ కార్యాలయాన్ని మూసివేశారు. అందులో పనిచేసే ఇద్దరు సిబ్బందికి కరోనా సోకడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. సచిన్‌ నిర్వహిస్తున్న పంచాయతీరాజ్‌ శాఖ కార్యాయలం హెడ్‌ క్వార్టర్స్‌ జులై 13 వరకు, గ్రామీణాభివృద్ధి శాఖ హెడ్‌ క్వార్టర్స్‌ జులై 14 వరకు మూసి ఉంటాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం కార్యాలయంలో శానిటైజేషన్ పనులు జరుగుతున్నాయి. మిగిలిన సిబ్బంది హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లారు. కాగా రాజస్థాన్ రాష్ట్రంలో కరోనా‌ కేసుల సంఖ్య సోమవారం ఉదయానికల్లా 24,392 కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో మొత్తం 510 మంది కరోనా కారణంగా మరణించారు.

ఇదిలావుంటే రాజస్థాన్ లో ప్రస్తుతం రాజకీయ సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం గడ్డు పరిస్థితులను ఎదుర్కుంటోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దాదాపు 25 మంది గెహ్లాట్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసే విధంగా పరిస్థితి ఉంది. వీరి వెనుక సచిన్ పైలెట్ ఉన్నారన్న ప్రచారం ఉంది. ఇప్పటికే సచిన్ పైలెట్ కూడా ఢిల్లీలోని అధిష్టానం పెద్దలను కలిశారు. ఈ సందర్బంగా 30 మంది ఎమ్మెల్యేలు తన వెంట ఉన్నారని, కొందరు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా తనకు మద్దతిస్తున్నారని సచిన్ పైలెట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.


Tags:    

Similar News