Rajasthan Political Crisis: రసవత్తరంగా రాజస్థాన్ రాజకీయం

Rajasthan Political Crisis: రసవత్తరంగా రాజస్థాన్ రాజకీయం
x
Highlights

Rajasthan Political Crisis: రాజస్థాన్ రాజకీయాలు రసవత్తకరంగా మారుతుంది. నిన్న రాత్రి మధ్యప్రదేశ్ బిజెపి ఎంపి జ్యోతిరాధిత్య సింధియా తో రాజస్థాన్...

Rajasthan Political Crisis: రాజస్థాన్ రాజకీయాలు రసవత్తకరంగా మారుతుంది. నిన్న రాత్రి మధ్యప్రదేశ్ బిజెపి ఎంపి జ్యోతిరాధిత్య సింధియా తో రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ సమావేశం అయ్యారు. సచిన్ పైలెట్ కు దొరకని సోనియా, రాహుల్ గాంధీ ల అపాయింట్మెంట్. సీఎం ఆధ్వర్యంలో జరిగే శాసనసభాపక్ష సమావేశానికి హాజరు కావాలని సచిన్ పైలెట్ కు అదిష్టానం ఆదేశం. అశోక్ గెహ్లాట్ ను సమర్ధిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం వైఖరిపై సచిన్ పైలెట్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ రోజు ఉదయం 10.30 గంటలకు జరిగే శాసనసభాపక్ష సమావేశానికి డుమ్మాకొట్టాలని సచిన్ పైలెట్ నిర్ణయం తీసుకున్నారు. తనతో పాటు తన వర్గానికి చెందిన 30 మంది శాసన సభ్యులు ఈ రోజు శాసన సభాపక్ష సమావేశానికి హాజరు కారని ప్రకటించిన సచిన్ పైలెట్. ఈ రోజు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను సచిన్ పైలెట్ కలవనున్నట్లు ప్రచారం. తమ ప్రభుత్వానికి 109 మంది శాసన సభ్యుల బలం ఉందని సీఎం అశోక్ గెహ్లాట్ వర్గం ప్రకటన చేసింది. నేడు సీఎల్పీ సమావేశానికి గహ్లోత్‌ పిలుపునిచ్చిన విషయం తెలిసందే. ఈ నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలందరికీ విప్‌ జారీ చేసినట్లు రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు అవినాశ్‌ పాండే తెలిపారు. ఈ సమావేశానికి హాజరుకాని వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. వ్యక్తిగత, ప్రత్యేక కారణాలు ఉంటే ఎమ్మెల్యేలకు ముందే తెలియజేయాలని సూచించారు. మరోవైపు సచిన్‌ నేడు బిజెపిలో చేరే అవకాశం ఉన్నట్లు జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నేడు బిజెపి జాతీయాధ్యక్షుడు జె.పి.నడ్డాతో భేటీ కానున్నట్లు చర్చ నడుస్తోంది. ఆ తర్వాత ఆయన భవిష్యత్తలు కార్యాచరణ ఏంటో ప్రకటిస్తారని తెలుస్తోంది.

రాజస్థాన్ అసెంబ్లీ లో మొత్తం సంఖ్యాబలం 200

ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ సంఖ్యా బలం 107 + 6 గురు బిఎస్పీ బహిష్కృత + 5గురు చిన్న పార్టీలు+ 10 స్వతంత్రులు = మొత్తం 122

బిజెపి సంఖ్యా బలం 72+ 3 ఆర్ఎల్పీ =75

అసెంబ్లీ లో మెజారిటీ 101

సచిన్ పైలెట్ చెబుతున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ నుండి 30 మంది శాసన సభ్యులు బయటకు వస్తే అశోక్ గెహ్లాట్ సర్కార్ కూలడం ఖాయం.

తనకు 109 మంది సభ్యుల బలం ఉందంటున్న అశోక్ గెహ్లాట్.

10.30 గంటలకు జరిగే శాసనసభాపక్ష సమావేశానికి ఎంత మంది హాజరవుతారనేదానిపై ఉత్కంఠత.

Show Full Article
Print Article
Next Story
More Stories