Rajasthan Political Crisis Live Updates: బీజేపీకి సచిన్‌ పైలట్‌ షాక్‌

Rajasthan Political Crisis Live Updates: బీజేపీకి సచిన్‌ పైలట్‌ షాక్‌
x
Rajasthan Political Crisis: sachin pilot says wont join bjp but was he ready
Highlights

Rajasthan Political Crisis Live Updates: కొంతమంది ఎమ్మెల్యేలను వెంటబెట్టుకొని బీజేపీలోకి వెళతారనుకున్న రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ బీజేపీకి షాక్ ఇచ్చారు.

Rajasthan Political Crisis Live Updates: కొంతమంది ఎమ్మెల్యేలను వెంటబెట్టుకొని బీజేపీలోకి వెళతారనుకున్న రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ బీజేపీకి షాక్ ఇచ్చారు. తాజా గందరగోళంపై స్పందించిన సచిన్ పైలట్ ఆదివారం అర్థరాత్రి కొంతమంది పాత్రికేయులతో మాట్లాడుతూ.. "బిజెపిలో చేరే ఆలోచన లేదు" అని అన్నారు. జైపూర్‌లో జరిగిన సమావేశానికి హాజరుకానీ నాయకులను వెంటబెట్టుకొని బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవం అన్నారు. తాను కాంగ్రెస్ లోనే ఉంటానని అయితే తనకు కొంతమంది ఎమ్మెల్యేల మద్దతు ఉందన్న విషయం అందరికి తెలుసునని అన్నారు. అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలవబోతున్నారన్న వార్తలను మాత్రం ఆయన ఖండించకపోవడం విశేషం..

ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ తో‌ విబేధాల నేపథ్యంలో సచిన్‌ పైలెట్‌ బీజేపీలో చేరతారనే ప్రచారం పెద్దఎత్తున జరిగింది. ఈ నేపథ్యంలో ఇవాళ జరగనున్న కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశానికి కొన్ని గంటల ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలావుంటే మధ్యప్రదేశ్ లో కూడా జ్యోతిరాదిత్య సింధియా మొదట ఇలాగే చెప్పారని.. అయితే బీజేపీ ఆఫర్ కు తలొగ్గిన ఆయన చివరి నిమిషంలో కాంగ్రెస్ కు షాక్ ఇచ్చారని పరిశీలకులు అంటున్నారు. ఇప్పడు సచిన్ పైలెట్ కూడా అలాగే చెబుతూ.. ఏదో ఒకరోజు బీజేపీలో చేరతారేమోనని కాంగ్రెస్ పెద్దలే అనుమానపడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories