Sabarmati Express: ఉత్తరప్రదేశ్‌లో తప్పిన ఘోర రైలు ప్రమాదం
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం తప్పింది. కాన్పూర్ వద్ద సబర్మతి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది.
Sabarmati Express: ఉత్తరప్రదేశ్‌లో తప్పిన ఘోర రైలు ప్రమాదం
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం తప్పింది. కాన్పూర్ వద్ద సబర్మతి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. రాత్రి రెండున్నర గంటల ప్రాంతంలో సబర్మతి రైలు 22 కోచ్‌లు పట్టాలు తప్పాయి. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాన్పూర్, భీంసేన స్టేషన్ మధ్య బ్లాక్ సెక్షన్‌లో రైలు పట్టాలు తప్పింది.
ప్రయాణికులను తరలించేందుకు బస్సులను ఏర్పాటు చేశారు. ట్రాక్ పై ఉన్న వస్తువు ఇంజిన్‌ను తాకడంతో ప్రమాదం జరిగినట్లు డ్రైవర్ తెలిపారు. అది ఇంజిన్ నుంచి 16వ కోచ్ దగ్గర గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంలో రైలు ఇంజిన్ తీవ్రంగా దెబ్బతింది. ఘటనపై రైల్వే శాఖ దర్యాప్తు ప్రారంభించింది. పోలీసులు, ఐబీ సంయుక్తంగా ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాయి. ఇంజిన్ ఢీకొన్న వస్తువు ఆనవాళ్లను అధికారులు భద్రపరిచారు.