అసోంలోని తేజ్‌పూర్‌లో హల్‌చల్‌ చేసిన పెద్దపులి

* కజిరంగ పార్క్ నుంచి వ్యవసాయ క్షేత్రాల్లోకి వచ్చిన పులి * రైతులపై దాడి చేసే ప్రయత్నం * తప్పించుకుని పోతున్న ఓ రైతుపై పంజా * వెంటనే పులి వెళ్లిపోవటంతో బయటపడ్డ రైతు

Update: 2020-11-25 06:29 GMT

Royal Bengal Tiger in Assam : అసోంలో ఓ పెద్దపులి హల్‌చల్‌ చేసింది. పార్కు నుంచి తప్పిపోయిన పులి. వ్యవసాయ క్షేత్రాల్లోకి చేరింది. రైతుల వెంట పడి భయాందోళనకు గురిచేసింది. ఈ ఘటన తేజ్‌పూర్ సమీపంలో చోటుచేసుకుంది. కజిరంగ నేషనల్‌ పార్క్ నుంచి తప్పిపోయిన పెద్దపులి. వ్యవసాయ క్షేత్రంలోని రైతులపై దాడికి ప్రయత్నించింది. దీంతో తలో దిక్కున పారిపోయేందుకు ప్రయత్నం చేశారు రైతులు. ఈ క్రమంలో ఓ వ్యక్తి గోతిలో దూకే ప్రయత్నం చేయగా. అదే టైమ్‌లో అతనిపై పంజా విసిరిన పులి అతనితో పాటే దూకింది. అయితే వెంటనే అక్కడ నుంచి పులి తప్పించుకుని వెళ్లటంతో ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. 

Tags:    

Similar News