Yes Bank Case: ఈడీ ఎదుట విచారకు హాజరైన అనిల్ అంబానీ

రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ గురువారం ముంబైలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరయ్యారు.

Update: 2020-03-19 09:49 GMT
Anil Ambani (file photo)

రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ గురువారం ముంబైలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరయ్యారు. యెస్ బ్యాంక్ ప్రమోటర్ రానా కపూర్ మరియు ఇతరులపై మనీలాండరింగ్ దర్యాప్తునకు సంబంధించి విచారణలో భాగంగా అనిల్ అంబానీని పిలిచినట్లు అధికారులు తెలిపారు. మనీలాండరింగ్

నివారణ చట్టం (పిఎంఎల్‌ఎ) కింద అంబానీ స్టేట్మెంట్ ను ఏజెన్సీ నమోదు చేస్తుందని తెలిపారు. కాగా అనిల్ అంబానీకి సంబంధించిన తొమ్మిది గ్రూప్ కంపెనీలు ఈ బ్యాంకు నుండి సుమారు 12,800 కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇదిలావుంటే యెస్ బ్యాంక్ సంక్షోభానికి ఆ సంస్థ మాజీ అధినేత రానా కపూరే అని భావించి అతన్ని ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేసింది.

ఆ తరువాత అధికారులు ఎన్‌సిపిఎ అపార్ట్‌మెంట్లలో రానా కపూర్ కుమార్తెలు రాధా, రోష్ని కపూర్ వాంగ్మూలాలను కూడా నమోదు చేశారు. అలాగే, రాధా కపూర్ భర్త ఆదిత్య ఖన్నాను ఈడీ అధికారులు ప్రశ్నించారు. మరో కుమార్తె బిందు కపూర్ ప్రస్తుతం 18 కంపెనీలలో డైరెక్టర్‌గా ఉండగా, రోష్ని కపూర్ 23 కంపెనీలలో, రాధా కపూర్ ఖన్నా 20 కంపెనీలలో ఉన్నారు. ఈ కంపెనీలలో చాలా వరకు ఒకే రకమైన డైరెక్టర్లు ఉన్నారు.


Tags:    

Similar News