ఊహించని షాక్: రవిశంకర్ ప్రసాద్, జవదేకర్ రాజీనామా
Cabinet Expansion: మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో సీనియర్లకు ఊహించని షాక్ ఎదురవుతోంది.
ఊహించని షాక్: రవిశంకర్ ప్రసాద్, జవదేకర్ రాజీనామా
Cabinet Expansion: మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో సీనియర్లకు ఊహించని షాక్ ఎదురవుతోంది. ప్రధానంగా కీలకమంత్రులను మంత్రివర్గంనుంచి తప్పించడం పలువురిని విస్మయ పర్చింది. కేంద్ర కేబినెట్ విస్తరణ నేపథ్యంలో మొదట కొద్ది మంది కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. కేబినెట్ విస్తరణకు కొద్ది నిమిషాల ముందు మరో ఊహించని వార్త వచ్చింది. కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్, కేంద్ర అటవీ పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో రాజీనామాల సంఖ్య 14 కు చేరింది. వీరందరి రాజీనామాలకు రాష్ట్రపతి కోవింద్ ఆమోద ముద్ర వేశారు.