Rajyasabha Polls: గుజరాత్ లో లెక్కింపు ఆలస్యం..మిగిలిన చోట్ల ఫలితాలు ఇవే!

ఎనిమిది రాష్ట్రాల్లో జరిగిన 19 రాజ్యసభ సీట్లకు గాను బీజేపీ మెజారిటీ సీట్లను దక్కించుకుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మధ్యప్రదేశ్‌లోని 3 సీట్లలో రెండు స్థానాలను బీజేపీ, ఒక స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకున్నాయి.

Update: 2020-06-19 14:49 GMT

ఎనిమిది రాష్ట్రాల్లో జరిగిన 19 రాజ్యసభ సీట్లకు గాను బీజేపీ మెజారిటీ సీట్లను దక్కించుకుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మధ్యప్రదేశ్‌లోని 3 సీట్లలో రెండు స్థానాలను బీజేపీ, ఒక స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకున్నాయి. బీజేపీ అభ్యర్థులు జ్యోతిరాదిత్య సింధియా, సుమెర్ సింగ్ గెలుపొందారు. ఇక కాంగ్రెస్ నుంచి మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ గెలుపొందారు.

రాజస్థాన్‌లోని 3 సీట్లలో 2 సీట్లు కాంగ్రెస్‌ పార్టీ చేజిక్కించుకుంది. పార్టీకి చెందిన కెసి వేణుగోపాల్, నీరజ్ డాంగి గెలుపొందారు. బీజేపీ ఇక్కడ ఒక సీటుతో సరిపెట్టుకుంది.. ఆ పార్టీ నాయకుడు రాజేంద్ర గెహ్లాట్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 సీట్లు గెలుచుకుంది. ఇక్కడ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నత్వాని విజయం సాధించారు. ఇదిలావుండగా, గుజరాత్‌లోని నాలుగు రాజ్యసభ స్థానాలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆలస్యంగా సాగుతోంది. 


Tags:    

Similar News