ముగిసిన రాజ్యసభ ఎన్నికల పోలింగ్

Arun Chilukuri
Updated on: 19 Jun 2020 5:27 PM IST
ముగిసిన రాజ్యసభ ఎన్నికల పోలింగ్
X

ఆంధ్ర ప్రదేశ్ లోని 4 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఆంధ్రప్రదేశ్‌లో 173 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అరెస్టు కారణంగా టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఓటు వేయలేదు. అలాగే మరో టీడీపీ నేత అనగాని సత్యప్రసాద్ సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నందున రాలేకపోయానని చంద్రబాబుకు లేఖ రాశారు. సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ఓట్ల లెక్కించనున్నారు. సాయంత్రం 6 గంటలకు రిటర్నింగ్‌ అధికారి ఫలితాలు వెల్లడించనున్నారు. కాగా వై‌సీపీ తరఫున రాజ్యసభకు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్‌ నత్వాని, పిల్లి సుభాష్‌ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావు పోటీలో ఉండగా టీడీపీ తరఫున వర్ల రామయ్య బరిలో ఉన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story