గుజరాత్ లో అప్రమత్తమైన కాంగ్రెస్.. రిసార్టుకు ఎమ్మెల్యేల తరలింపు!

గుజరాత్ లో అప్రమత్తమైన కాంగ్రెస్.. రిసార్టుకు ఎమ్మెల్యేల తరలింపు!
x
Highlights

గుజరాత్ రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికలకు ముందే పంతొమ్మిది మంది కాంగ్రెస్ శాసనసభ్యులను రాజస్థాన్‌లోని రిసార్ట్‌కు తరలించింది ఆ పార్టీ.

గుజరాత్ రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికలకు ముందే పంతొమ్మిది మంది కాంగ్రెస్ శాసనసభ్యులను రాజస్థాన్‌లోని రిసార్ట్‌కు తరలించింది ఆ పార్టీ. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో, వారిని మరికొందరు కూడా అనుసరించవచ్చనే భయంతో కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో రాజస్థాన్ మౌంట్ అబూలో ఉన్న వైల్డ్ విండ్స్ అనే రిసార్ట్ కు తరలించగా.. మరో 26 మంది ఎమ్మెల్యేలను కూడా తరలించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. రాజస్థాన్‌ లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి.. అక్కడ బిజెపి జోక్యం ఉండదనే కారణంతో ఎమ్మెల్యేలను తరలించినట్టు తెలుస్తోంది.

182 మంది సభ్యుల రాష్ట్ర అసెంబ్లీలో బిజెపికి 103 మంది సభ్యులు ఉన్నారు, నాలుగు రాజ్యసభ స్థానాలున్న గుజరాత్ లో బీజేపీకి మూడు సీట్లు దక్కుతాయి. ఒకటి కాంగ్రెస్ కు దక్కుతుంది.. అయితే గుజరాత్‌లో కాంగ్రెస్‌కు 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వారిలో ఎనిమిది మంది ఇప్పటికే రాజీనామా చేయడంతో మిగిలిన వారిలో కొందరిని ఇప్పటికే వివిధ రిసార్ట్‌లకు తరలించారు. వాస్తవానికి అంతకుముందు బలంతో, కాంగ్రెస్ రెండు స్థానాలకు దక్కించుకుంటుందని అంచనా వేశారు. అయితే మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో రెండుకు బదులుగా ఒకే సీటు మాత్రమే దక్కే అవకాశం ఉంది. కాగా జూన్ 4 న తన ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన తరువాత ఈ చర్య తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories