Rajnath Singh: భారతీయుల విషయంలో అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాం..
Rajnath Singh: ఉక్రెయిన్‌లోని భారతీయులను తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.
Rajnath Singh: భారతీయుల విషయంలో అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాం..
Rajnath Singh: ఉక్రెయిన్‌లోని భారతీయులను తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. భారతీయులను వెనక్కి తీసుకురావడానికి తమ ప్రభుత్వం ప్రతి అవకాశాన్నీ అందిపుచ్చుకుంటోందని, అయితే పరిస్థితులు అక్కడ వేరుగా ఉన్నాయన్నారు. అక్కడి భారతీయులు విమానంలో తిరిగి వచ్చేట్లుగా పరిస్థితులు లేవని, అయినా ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు.
ఇప్పటికే ఓ విమానాన్ని పంపించామని, కొందరు భారత్‌కు క్షేమంగా చేరుకున్నారని రాజ్‌నాథ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఉక్రెయిన్‌లో ఎయిర్ స్పేస్ క్లోజ్ చేయడంతో అక్కడ పౌర విమానాలు ల్యాండ్ అయ్యే పరిస్థితి లేదని ఆయన స్పష్టం చేశారు. యుద్ధం పరిస్థితులు తలెత్తకూడదని తాము కోరుకుంటున్నామని చెప్పారు రాజ్‌నాథ్.