సిఎఎ ముస్లింలకు ముప్పు కాదు, ఎన్‌పిఆర్ అవసరం : రజినీకాంత్

Update: 2020-02-05 10:43 GMT

కొత్త పౌరసత్వం (సవరణ) చట్టం , జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్‌పిఆర్), మరియు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ( ఎన్‌ఆర్‌సి ) పై తమిళనాడులో ఉద్దేశపూర్వకంగా రాజకీయ పార్టీలు ప్రజలను రెచ్చగొడుతున్నాయని నటుడు రజనీకాంత్ బుధవారం అన్నారు. చెన్నైలోని పోయెస్ గార్డెన్ నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ, దేశంలో ముస్లింలకు ఏమైనా ముప్పు ఉంటే తాను మొదటగా స్వరం వినిపిస్తానని హామీ ఇచ్చారు.

'ముస్లింలకు ఎటువంటి ముప్పు లేదు. రాజకీయ పార్టీలు తమ రాజకీయ లాభం కోసం సిఎఎపై భయాన్ని కలిగిస్తున్నాయి.. వారికి మత పెద్దలు కూడా తోడయ్యారు.. ఇది చాలా తప్పు. CAA భారత పౌరులను ప్రభావితం చేయదని కేంద్రం స్పష్టంగా పేర్కొంది. ఇది పొరుగు దేశాల నివాసితులకు పౌరసత్వం కల్పించడం గురించి మాత్రమే' అని రజనీకాంత్ అన్నారు.

అంతేకాదు.. 'ఇక్కడ ముస్లింలకు ఎంత హక్కులు ఉన్నాయంటే.. దేశ విభజన సమయంలో ముస్లింలు (కొంతమంది) ఇక్కడే ఉండిపోయారు, ఇది వారి మాతృభూమి అని నిర్ణయించుకున్నారు. మరణించే వరకు వారు ఇక్కడే.. అలాంటిది ఎవరైనా వారిని దేశం నుండి ఎలా బయటికి పంపగలరు? ఇక్కడ ముస్లింలకు ఏమైనా ముప్పు ఉంటే ప్రశ్నించే మొదటి గొంతు నాదే' అని వ్యాఖ్యానించారు.

CAA కి వ్యతిరేకంగా విద్యార్థులు నిరసన తెలిపే ముందు.. సమస్యను లోతుగా విశ్లేషించాలి అని రజనీకాంత్ సూచించారు. ఈ నిరసనలలో పాల్గొనడానికి ముందు వారు తమ ప్రొఫెసర్లు లేదా పెద్దలతో ఒక మాట మాట్లాడాలి, లేకపోతే రాజకీయ నాయకులు వాటిని తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటారు. ఎఫ్ఐఆర్ దాఖలు చేస్తే విద్యార్థుల జీవితాలు తారుమారు అవుతాయని అన్నారు. కాగా ఈ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా డిసెంబర్‌ నుంచి నిరసనలు జరుగుతున్నాయి. ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియాలో నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి నిరసనలకు దూరంగా ఉండాలని రజినీకాంత్ పిలుపునిచ్చారు.

భారతీయ పౌరులు మరియు విదేశీయుల మధ్య తేడాను గుర్తించడానికి ఎన్‌పిఆర్ ఎంతో అవసరమని రజనీకాంత్ అన్నారు. ఈ దేశ పౌరులు ఎవరు? బయటి నుండి వచ్చిన వారెవరు అనే విషయం మనకు తెలియదా అని ప్రశ్నించారు. మరోవైపు శ్రీలంకన్ తమిళుల గురించి మాట్లాడిన రజనీకాంత్.. గత 30 సంవత్సరాలుగా తమిళనాడులో నివసిస్తున్న శరణార్థులకు ద్వంద్వ పౌరసత్వం కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వారిని మైనారిటీగా పరిగణించకూడదని.. చోళ రాజుల కాలం నుండి అక్కడ నివసిస్తున్నారని అన్నారు. ఇక తూత్తుకుడిలో హింసకు సంబంధించి తనకు సమన్ల వచ్చాయా అని విలేకరులు ప్రశ్నించగా.. 'నాకు ఇప్పటివరకు నోటీసు రాలేదు.. వస్తే ఖచ్చితంగా నా పూర్తి సహకారాన్ని అందిస్తాను' అని అన్నారు 

Tags:    

Similar News