Rajasthan Politics: హోటళ్లలో ఎమ్మెల్యేలు.. రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందా?

Rajasthan Politics: రాజస్థాన్‌లో రాజకీయ గందరగోళం తీవ్రమైంది. సచిన్ పైలట్ క్యాంప్‌కు చెందిన 24 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మనేసర్, గుర్గావ్‌లోని హోటళ్లలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

Update: 2020-07-12 12:00 GMT
ashok gehlot (File Photo)

Rajasthan Politics: రాజస్థాన్‌లో రాజకీయ గందరగోళం తీవ్రమైంది. సచిన్ పైలట్ క్యాంప్‌కు చెందిన 24 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మనేసర్, గుర్గావ్‌లోని హోటళ్లలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. వీరంతా సీఎం అశోక్ గెహ్లాట్ పనితీరుపట్ల అసంతృప్తిగా ఉన్నారని.. సచిన్ పైలెట్ కు నాయకత్వ బుధ్యతలు ఇవ్వాలని కోరుతున్నారు. వారి ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేశారు. సచిన్ పైలట్ కూడా ఢిల్లీలో క్యాంప్ చేశారు. కొంతకాలంగా గెహ్లాట్‌పై కోపంగా ఉన్న పైలట్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలవడానికి ఢిల్లీ వచ్చారని సమాచారం. సయోధ్య మార్గం కనుగొనకపోతే, మధ్యప్రదేశ్ లో లాగా.. రాజస్థాన్ లో పైలట్.. గెహ్లాట్ ప్రభుత్వాన్నీ పడగొట్టే ప్రయత్నం చేస్తారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

రాజస్థాన్‌లో కూడా మధ్యప్రదేశ్ కథ పునరావృతమై, పైలట్ అనుకూల ఎమ్మెల్యేలు శాసనసభను విడిచిపెడితే, గెహ్లాట్ ప్రభుత్వం మైనారిటీలో వస్తుంది. ప్రస్తుతానికి అసెంబ్లీలో బలాబలాలు ఇలా వున్నాయి. 200 అసెంబ్లీ సీట్లున్న రాజస్థాన్ లో.. ప్రస్తుతం అధికార కాంగ్రెస్ కు 107 మంది సభ్యుల బలం ఉండగా.. బీజేపీకి 93 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రభుత్వం నిలవడానికి కావలసిన మాజిక్ ఫిగర్ 101 కాంగ్రెస్ కు అధనంగా మరో ఆరుగురు సభ్యుల మద్దతు ఉంది. ఈ నేపథ్యంలో అసంతృప్తి ఎమ్మెల్యేలు ఏడుమంది గనక బీజేపీ పంచన చేరితే కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయం. అయితే అది సచిన్ పైలెట్ చేత్తుల్లో మాత్రమే ఉంది. మరోవైపు ఇవాళ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఎమ్మెల్యేల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎందమంది ఎమ్మెల్యేలు వస్తారోనన్నది ఆసక్తికరంగా మారింది.  


Tags:    

Similar News