నుపుర్ శర్మ తలను తెస్తే ఇల్లు రాసిస్తా: అజ్మీర్ వాసి

Nupur Sharma: బీజేపీ బహిష్కృత నాయకురాలు నుపుర్ శర్మను శిరచ్ఛేదనం చేసినవారికి తన ఇల్లు రాసిస్తానంటూ అజ్మీర్ వాసి ప్రకటించాడు.

Update: 2022-07-05 15:15 GMT

నుపుర్ శర్మ తలను తెస్తే ఇల్లు రాసిస్తా: అజ్మీర్ వాసి

Nupur Sharma: బీజేపీ బహిష్కృత నాయకురాలు నుపుర్ శర్మను శిరచ్ఛేదనం చేసినవారికి తన ఇల్లు రాసిస్తానంటూ అజ్మీర్ వాసి ప్రకటించాడు. ఈ ఆఫర్‌ను ప్రకటించిన వ్యక్తిని రాజస్థాన్‌లోని అజ్మీర్ పట్టణానికి చెందిన సల్మాన్ చిస్తీగా గుర్తించారు. ఎవరైనా సరే నుపుర్ శర్మ తలను తీసుకొస్తే తన ఆస్తులను ఇచ్చేస్తానని సల్మాన్ చెబుతున్నట్టు ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా ముస్లింలను హింసిస్తున్నారని, చంపుతున్నారని అతను ఆరోపించాడు. దీనిపై పోలీసులు స్పందించారు. సల్మాన్ మత్తులో మాట్లాడినట్టు ఉందని చెప్పుకొచ్చారు. సల్మాన్ కోసం గాలిస్తున్నామన్నారు. త్వరలోనే పట్టుకుని చట్టప్రకారం శిక్షిస్తామని చెప్పారు.

Tags:    

Similar News