Rahul Gandhi: అమెరికా పర్యటనకు రాహుల్ గాంధీ.. కీలక సమావేశాల్లో పాల్గొనున్న కాంగ్రెస్ నేత
Rahul Gandhi: సెప్టెంబర్ 8 నుంచి 10 వరకూ టూర్
Rahul Gandhi
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సెప్టెంబర్ 8 నుంచి 10 వరకూ అమెరికాలో పర్యటించనున్నారు. వాషింగ్టన్ డీసీ, డల్లాస్‌లలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రాహుల్ పర్యటనపై ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్ శామ్ పిట్రోడా తెలిపారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా నియామకమయ్యాక రాహుల్ అమెరికాకు వెళ్లడం ఇదే తొలిసారి. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత అయినప్పటి నుంచి ఆయనతో మాట్లాడాలని ఎన్నారైలు, దౌత్యవేత్తలు, వ్యాపార ప్రముఖులు, అంతర్జాతీయ మీడియా నుంచి చాలా అభ్యర్థనలు వచ్చాయని పిట్రోడా పేర్కొన్నారు.
సెప్టెంబర్ 8న డల్లాస్‌లో, సెప్టెంబర్ 9-10 తేదీల్లో వాషింగ్టన్ డీసీలో ఉంటారని తెలిపారు. డల్లాస్‌లో టెక్సాస్ యూనివర్శిటీ విద్యార్థులతో, విద్యా సంఘం ప్రతినిధులతో కలిసి మాట్లాడనున్నట్టు పిట్రోడా తెలిపారు.